పఠనీయం

రసాత్మకం.. భావకవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీట్స్ కవితా వైభవం
ఆంగ్ల గ్రంథానికి అనుకరణ రచన: డా.కోడూరి ప్రభాకరరెడ్డి
వెల: రూ.100
ప్రతులకు: రచయిత, 7/829
ఎస్.వి.యం.రోడ్
వై.ఎం.ఆర్. కాలనీ
ప్రొద్దుటూరు.

పాశ్చాత్య దేశాలలో ఆధునిక యుగంలో ఆవిర్భవించిన కవితా ప్రక్రియకు లిరికల్ పొయిట్రీ అని పేరు. లైర్ అనేది ఒక జంత్ర వాద్య విశేషం. దానిని మీటుతూ పాడే పాటను లిరికల్స్ అన్నారు. ప్రపంచ యుద్ధాలకు భయపడి ఆ యుగంలో కవులు ప్రకృతి వెనుక దాక్కున్నారు. ఇదే పాశ్చాత్య భావకవిత్వావిర్భావానికి నాంది. తెలుగులో ఒక శతాబ్దంలో దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, రాయప్రోలు సుబ్బారావు వంటి వారి భావ కవిత్యోద్యమానికి బ్రిటన్‌లోనూ లిరికల్ పొయిట్రీ స్ఫూర్తినిచ్చింది.
షెల్లీ కీట్స్ బైరన్ వర్డ్స్‌వర్డ్ వంటి వారి సానెట్స్ చాలా ప్రసిద్ధమైనవి. వీరిలో కీట్స్ ఉత్తమ శ్రేణికి చెందిన లిరిసిస్టు. ఆంగ్ల భాషాభిజ్ఞులకు కీట్స్ గీతాలు సుపరిచితమే. ఐతే తెలుగు భాషీయులకు వాటిని పూర్తిగా అందించే ప్రయత్నం ఇప్పుడు డా.కోడూరి ప్రభాకరరెడ్డిగారు చేయటం ముదావహం.
ప్రభాకరరెడ్డి గారు పండిత కవి - కవి పండితుడు. సాహితీ వైద్యుడు. లోగడ గాథాసప్తశతి వంటి ప్రాకృత రచనలు తెలుగులోనికి తెచ్చి సుప్రతిష్టితులైనారు. ఇప్పుడు కీట్స్ షేక్సిపియరు వంటి పాశ్చాత్యుల సానెట్స్‌ను యథామాతృకంగా అనువదించి సామాన్య పాఠకులకు కీట్స్‌ను రుచి చూపించారు. ఇందులో మొత్తం 25 ఖండికలున్నాయి. దానితోపాటు కీట్స్ సంక్షిప్త జీవిత పరిచయం కూడా ఉంది. కీట్స్ క్షయవ్యాధితో కృంగిపోతూ రచించిన ‘్ధృవతార’ అనే ఖండికతో ఈ పుస్తకం ముగించారు. విచిత్రమేమంటే కీట్స్ ఈ చివరి గీతాన్ని తన చేతిలో ఉన్న షేక్స్పియరు రచన అట్టమీద ఖాళీ ఉంటే రాసుకున్నాడు. దీనిని బ్రిటీషు లైబ్రరీలో భద్రపరిచారు.
కీట్స్ జీవించింది 25 సంవత్సరాలు మాత్రమే. జీవితకాలంలో ఆయనకు రావలసిన ఖ్యాతి రాలేదు కూడా. మరణానంతరం కీట్స్ రచించిన టుడ్స్ (ఒక ఆంగ్ల ఛందస్సు) అత్యుత్తమ రచనలుగా ప్రపంచమంతా అభినందించింది. కీట్స్ ఆర్థికంగా శారీరకంగా నలిగిపోయాడు. మానసికంగా రసాత్మకంగా ఉత్తమ శ్రేణి రచనలను మానవాళికి మిగిల్చిపోయాడు.
‘్ఫల్ ఫర్ మి’ అనే తన కవితలో కీట్స్ తన ప్రేయసిని వర్ణించాడు. ఆమె అప్రాప్య మనోహరి. ఈ కవిత ప్రభావం మనకు స్పష్టంగా రాయప్రోలు, తల్లావఝల, దేవులపల్ల వే - న -రెడ్డి వంటి ఆధునిక కవులపై కనపడుతుంది. ‘టు లార్డ్ బైరన్’ అనే మరో భావ కవిని ప్రశంసిస్తూ కీట్స్ ఒక కవిత రాశాడు.
పాశ్చాత్య కవితా ప్రస్థానంలో ఆధునిక రీతులతోపాటు ఆధునిక తెలుగు సాహిత్యంలో భావ కవితా రీతులు అధ్యయనం చేయాలని అనుకున్న వారికి ఈ గ్రంథం ఎంతగానో ఉపకరిస్తుంది. ఇవి చదివాక ఆంగ్లంతో పరిచయం ఉన్నవారు కీట్స్ కృతిని చదవాలనే ఆసక్తిని పెంచుకుంటారు.

--ప్రొ.ముదిగొండ శివప్రసాద్