డైలీ సీరియల్

కాలక్షేపం నవలికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్నాభట్ల నవలికలు-2
-జన్నాభట్ల నరసింహప్రసాద్
వెల: రూ.100
ప్రతులకు: రచయిత, 1-108/7, అరవిందనగర్, నాగారం,
హైదరాబాద్-500 083.

తన రచనా వ్యాసంగములో జన్నాభట్టల నరసింహ ప్రసాద్‌గారు పరిచితులే. ఇది వారి 5వ గ్రంథము. కథకంటే పెద్దది, నవల కంటే చిన్నది అయిన సాహిత్య ప్రక్రియను ‘నవలిక’ అంటారట. ఇందులో యాత్రికుడు, మరియు కళాకారుడు అన్న రెండు నవలికలు ఉన్నాయి. యాత్రికుడు అన్న నవలికలో కృష్ణమోహన్ అనే సంపన్నుడు సర్వం త్యజించి ఒక సన్యాసిగా ఒక సంవత్సరం దేశాటనము చేయవలెనని గురువు పరమహంస స్వామి ఆదేశం మేరకు పలు ప్రదేశాలు తిరిగి, పలురకాలైన మనుషుల్ని, ప్రవృత్తుల్ని మతాల్ని అనుభూతించి, తాను తిరిగి చూసిన ప్రతిచోటున అక్కడి సమస్యల్ని పరిష్కరించి ఆదరణ చూరగొంటాడు.
ఇక రెండవ నవలికలో చంద్రశేఖర శాస్ర్తీ అనే ఓ కులీన యువకుడు శ్రోత్రియ కుటుంబం నుండి వచ్చిన విద్యావంతుడు. నిమ్న కులస్థులు నిర్వహించే నాటకాల వేపు మొగ్గుచూపి, సంస్థ యజమాని రెండో కూతురు చిన్న కాశమ్మను ప్రేమించి వివాహం చేసుకుని తనవారినందరినీ వదిలి నాటకాలకే అంకితవౌతాడు. చివరకు భార్యాపిల్లలను కూడా త్యజించి ‘కటిక చీకట్లో’ కలిసిపోతాడు.
ఈ రెండు నవలికల్లో రచయిత పాఠకులకు ఇవ్వదలుచుకున్న సందేశం ఏమిటో అవగతం కాదు. సంవత్సరంపాటూ కటిక దారిద్య్రాన్ని చవిచూసిన కృష్ణమోహన్ చివరకు నలభై లక్షల ‘ఆడీ’ కారులో కోట్లు విలువచేసే విల్లాకు కుటుంబ సమేతంగా బయలుదేరుతాడు. ఇక కళాకారుడు శాస్ర్తీ తనని నమ్ముకున్న భార్యాబిడ్డల్ని పరిత్యజించి ఎటో వెళ్లిపోతాడు. గొప్ప సందేశాలు ఇవ్వకున్నా కాలక్షేపానికి పనికివస్తుంది ఈ గ్రంథం.

-కూర చిదంబరం 8639338675