పఠనీయం

తెలంగాణ తలెత్తుకున్న రోజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక నియంత తలవంచిన రోజు
రచయిత: డా పి.భాస్కరయోగి
పేజీలు:262, వెల:రూ.300/-
ప్రచురణ:విజ్ఞాన సరోవర ప్రచురణలు,
హైదరాబాద్ అన్ని పుస్తక కేంద్రాల్లో లభ్యం
*
డాక్టర్ పి.భాస్కరయోగి రచించిన ‘ఒక నియంత తలవంచిన రోజు’ పుస్తకం ఒక పరిశోధనా గ్రంథం. తెలంగాణ విమోచనదినంగా పిలుచుకుంటున్న సెప్టెంబర్ 17న చారిత్రక రోజుకు పూర్వరంగమంతా ఈ పుస్తకంలో అక్షర రూపంలో ఆవిష్కృతమైంది. తెలంగాణ విమోచన కోసం ఎందరో వ్యక్తులు, ఎన్నో శక్తులు, మరెన్నో సంస్థలు- పార్టీలు ప్రాణాలొడ్డాయి. ఆ కృషినంతా విహంగవీక్షణంగా గ్రంథస్తం చేయడం ఓ సాహసం.
ఇప్పటివరకు నిజాం నిరంకుశ పాలనపై అనేక గ్రంథాలు వెలుగుచూసినా చాలా పుస్తకాలు ఆయా పార్టీల- సంస్థల దృష్టికోణంలో వెలువడినాయి గాని ఒక పరిశీలకుడి దృష్టితో వెలువడిన గ్రంథం అరుదు. ఆ లోటును డాక్టర్ భాస్కరయోగి తాజా గ్రంథం ద్వారా తీర్చారు.
వందేమాతరం ఉద్యమం, ఆంధ్ర మహాసభ ఆవిర్భావం, గ్రంథాలయోద్యమం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కార్యక్రమాలు, స్వామీ రామానంద తీర్థం త్యాగం, జమలాపురం కేశవరావు తెగువ, శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఏర్పాటు, సోషలిస్టుల మేధో సంపన్నత, కమ్యూనిస్టుల కార్యాచరణ, సాయుధ తిరుగుబాటు, హిందూ మహాసభ విరాట్ రూపం, ఆర్య సమాజపు అగ్నికీలలు దాశరధి జైలు గోడలపై రాతలు, యాదగిరి బండెనక బండి కట్టి నిజాం ఘోరి కట్టేందుకు ఇచ్చిన పిలుపు, ముస్లిం లిబరల్స్ పోరాటం, షోయబుల్లాఖాన్ బలిదానం, అంతిమంగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆపరేషన్ పోలో పేర సాగిన పోలీసు ఆక్షన్ (సైనిక చర్య) ఇట్లా వివిధ ఘట్టాలను రచయిత వివిధ అధ్యాయాలుగా విభాగించుకుని అరుదైన ఫొటోలను జతపరచి అక్షరానికి మరింత సత్తువను సమకూర్చారు. అలా చేసినందువల్లనే ఇది సంపూర్ణ పరిశోధన గ్రంథమైంది.
‘‘అజేయమైన కాకతీయ సామ్రాజ్య పతనానంతరమే ముస్లిం పాలకులు దక్కన్ ప్రాంతంలో కాలుపెట్టగలిగారు. 13వ శతాబ్దిలో వారికి ఇది సాధ్యమైంది’’ (పేజీ 21)- ఈ వాక్యం ముందు - వెనకాల ఈ గ్రంథం కొనసాగింది. 13వ శతాబ్దం ప్రారంభం నుంచి 20వ శతాబ్దం అర్థ్భాగం వరకు గల ‘తెలంగాణ చరిత్ర’ రేఖామాత్రంగా మనకు ఇందులో కనిపిస్తోంది. అంతేగాక కాకతీయులపై పుస్తక ప్రారంభ అధ్యాయంలో 20 పేజీల సంగ్రహ చరిత్రను అందించారు. అంటే 11వ శతాబ్దం నుంచి తెలంగాణ చరిత్రను మనం ఈ పుస్తకంలో స్పర్శించవచ్చు. ఇదంతా గ్రంథానికి ఆధారభూతమైన పునాదిగా పనిచేసింది. ఆ అనంతరం కొనసాగిన కల్లోలాన్ని కళ్ళముందు రచయిత పెట్టారు. ప్రధానంగా అసఫ్‌జాహి పాలకుల నిర్వాకం ఇందులో రేఖామాత్రంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో రెచ్చిపోయిన రజాకార్లు, ఖాసీం రజ్వీ నాయకత్వంలో వారి ఆగడాలు, దురాగతాలు, మానభంగాలు, స్ర్తిలచేత నగ్నంగా బతుకమ్మ ఆడించడం, మతం మార్పిళ్ళకు ఒత్తిడి చేయడం, హిందువులపై రకరకాలైన పన్నులేసి హింసించడం, ఓర్పు కోల్పోయిన రైతాంగం తిరుగుబాటు బాట పట్టడం, తమకి తాము విముక్తిపథం తొక్కడం చారిత్రక సన్నివేశం. వీటన్నింటిని పూసగుచ్చినట్టు రచయిత ఈ గ్రంథంలో పొందుపరిచారు. ‘పోలీసు చర్యకు ముందు నిజాం సర్కస్ ఫీట్లు’ అన్న శీర్షిక పుస్తకంలో కీలకమైంది. విలీనానికి ముందు జరిగిన హైడ్రామా ఇందులో కనిపిస్తుంది. ఛత్తారీ నవాబ్, మీర్ లాయక్ అలీ, ఎల్.ఎడ్రూస్‌ల కుట్రలు, కుతంత్రాలు ఈ అధ్యాయంలో తేటతెల్లమవుతాయి. ఈ పుస్తకం చివరి పేజీల్లో ఎలాంటి శీర్షిక లేకుండా కొంతమంది ‘అన్‌సంగ్ హీరోల’ ఫొటోలను ముద్రించారు. రచయిత శ్రమకోర్చి సేకరించి పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. నిజాం కాలంలో ప్రజలు పండించిన పంటలు, వారు చెల్లించిన పన్నులు- శిస్తులు, పాలనా విధానంపై, ఆనాటి సాంఘిక స్థితిగతులపై ఇంకొంత లోతుగా పరిశీలన జరిపి ప్రకటిస్తే ఈ గ్రంథం మరింత సంపూర్ణంగా ఉండేది.
*

---వుప్పల నరసింహం