పఠనీయం

ఆరోగ్యం - ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువులమీద పెడుతున్నంత శ్రద్ధ నేడు ఆరోగ్యంమీద పెట్టడంలేదనే చేప్పాలి. మందులు మ్రింగని కుటుంబం - కాదు - మనిషే లేడని చెప్పాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. నేడు ఎంతోమంది నిత్యం మందులు మింగుతూనే వున్నా బిసి, చక్కెర వ్యాధి, గుండె జబ్బులు లాంటి సమస్యలతో సతమతమవుతూనే ఉండటాన్ని చూస్తూ వున్నాం. ఆరోగ్యం మందులనుండి రాదు. మందులు అనారోగ్యంనుంచి బయట పడేస్తాయేమో కానీ ఆరోగ్యాన్ని ఇవ్వలేవు. ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఆహారమే! మనం తింటున్నాం, పనిచేస్తున్నాం, పడుకుంటున్నాం..
అంతే! కానీ వంటికి శ్రమ, కంటికి నిద్ర, పంటికి విశ్రాంతి అనేక ఆరోగ్య సూత్రాలని విస్మరిస్తున్నాం. అమ్మమ్మలు పాటించి చెప్పిన ఆరోగ్య సూత్రాలు మరచి తంటాలు పడుతున్నాం. మన ఆరోగ్యం మనం తినే ఆహారంమీద ఆధారపడి వుంటుంది. ఆహారం యొక్క శుచి, శుభ్రత, అందులోని పోషక విలువలు, నాణ్యత గురించి ఆలోచించక, సమయానికి అందుబాటులో వుండే ఫాస్డ్ఫుడ్స్‌నో, రుచి ఆధారంగా నోరూరించే పదార్థాలనో ఆస్వాదిస్తున్నాం. దానితోనే సమస్య ఆరంభమైంది.
నేడు ఊబకాయం ఒక పెద్ద సమస్య. ఎన్ని వ్యాయామాలు చేసినా, వాకింగ్ శ్రద్ధగా రోజూ చేసినా, జిమ్ములకి వెళ్లినా బరు తగ్గుతున్నది తక్కువే. 1970 దశకంలో అమెరికా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక పౌష్టిక ఆహార పిరమిడ్‌ని నిపుణుల కమిటీ తయారుచేసింది. అందులో తక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. మాడరేట్‌గా మాంసకృతులు, ఎక్కువగా పిండి పదార్థాలని తీసుకోవాలని ప్రకటించారు. గుండె జబ్బులకి కొవ్వు ఎక్కువగా తినటమే కారణం చెప్పగా, అప్పటినుండి కొవ్వు పదార్థాలని తినడం దాదాపుగా దూరం పెట్టేశారు ప్రజావళి. అదే నిజమైతే గుండె జబ్బులు, బిపి, షుగరు జబ్బులు తగ్గి ఉండాలి. కానీ అలా జరగలేదు.
అనారోగ్యకరమైన ఆహార విధానాలవలన జీవక్రియ లోపం ఏర్పడుతుందనీ, షుగరు వ్యాధిని రివర్స్ చేయవచ్చుననీ నిర్థారించి ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు డా.జానస్ఫంగ్ ది ఒబేసిటీ కోడ్, ది డయాబెటిస్ కోడ్, కంప్లీట్ గైడ్ టు ఫాస్టింగ్ అనే మూడు అద్భుతమైన పుస్తకాలు రచించారు.
తమ క్లినిక్‌లో వేలాదిమంది డయాబెటిస్‌కి మందులు లేకుండా ఆహారంతోనే ఆరోగ్యం అని మరియు ఉపవాసం ఆరోగ్యప్రదాయిని అని శాస్ర్తియంగా నిరూపించారు. వీరు సూచించిన ఆహార విధానాన్ని లో కార్బ్- హై ఫాట్ డైట్ అంటారు. మన దేశంలో తెలుగు రాష్ట్రాలకి క్యాపిటల్ అనే ముద్రపడిన తరుణంలో ఈ పుస్తకాల్ని తెలుగులో అనువదించి పరిచయం చేయటం ద్వారా సమదర్శిని (శ్రీ జాస్తి కిశోర్‌బాబు) తెలుగు ప్రజలకు ఎంతో మేలు చేశారు. వీరు ఊబకాయం, మధుమేహం, ఉపవాసం అన్న పేర్లతో పైన పేర్కొన్న డా.్ఫంగ్ గారి మూడు పుస్తకాల్ని అతి సరసమైన ధరకే వెలువరించారు. ఆరోగ్యం గురించి అత్యంత విలువైన సమాచారం అందిస్తున్న ఈ పుస్తకాలలో ఎల్‌సిహెచ్‌ఎఫ్ డైట్ పాటిస్తూ - మందులు మానేసి సహజ సిద్ధంగా ఎలా బిపి, షుగరు, ఊబకాయ సమస్యలనుండి బయటపడవచ్చునో అత్యంత తేలికగా అందరికీ అర్థమయ్యే రీతిలో వ్రాశారు.
ఇదే ఆహార విధానానికి బలంగా ప్రాచుర్యం కల్పిస్తున్న ప్రముఖ గుండె శస్తచ్రికిత్స నిపుణులు డా.పి.వి.సత్యనారాయణగారు- ‘మనం ఏం తినాలి?’ అనే మరో పుస్తకాన్ని ఇంతకుముందే వెలువరించారు.
ఈ నాలుగు పుస్తకాలూ లో కార్బోహైడ్రేట్- హై ఫాట్ డైట్ ఎవరు, ఎలా, ఏ ఆహారం ఎంత పరిమాణంలో తీసుకోవాలో మార్గదర్శనం చేస్తాయి. మందులు లేకుండా జీవించగలం అనే ధీమాని ఇస్తాయి. అయితే ముఖ్యంగా గమనించవలసినది ఏమిటంటే- వీటిలో సూచించబడిన ఆహార విధానానికి మారాలంటే కొన్ని రక్తపరీక్షలు చేయించుకొని ఒక డాక్టర్‌ని సంప్రదించి పాటించడం మంచిది. కేవలం ఈ పుస్తకాలు తిరగేసి ఈ విధానం పాటించడం సబబు కాదు.
సమదర్శినిగారు పరిచయం గావించిన ఈ పుస్తకాలు ఒక్కొక్కటి కేవలం 100 రూపాయలు మాత్రమే. ఇంత సరసనమైన ధరకి ఈ విలువైన పుస్తకాలు అందించడం ఎంతో ముదావహం!

-బి.వి.ఎస్.ప్రసాద్ 9949944006