పఠనీయం

శోధించాల్సింది ఎంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఋగ్వేదం2 నూతన భాష్యం
రచన: ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్‌
గ్రంథ ప్రతులకు
ఫోన్ నెం.040-274225668
*
విద్ ధాతువునుండి ఏర్పడినది వేదశబ్ధం. అంటే తెలుసుకోదగ్గది. వేదములు సనాతన హిందూ ధర్మమునకు ఆత్మలాంటివి. వేదాలలో అనేక అంశాలు స్పృశించబడ్డాయి. కొన్ని బృహద్వివరణాలతో కొన్ని కథల రూపంలో మరికొన్ని సాంకేతికంగా వివరించబడ్డాయి. వీటన్నిటినీ సమగ్రంగా అధ్యయనం చేసి తెలుసుకోవాలంటే సామాన్య మానవులకు అంత సులభం కాదు. అందుకే ఎంతోమంది పండితులు వేదాలకు వ్యాఖ్యలు చేసి మనకు అందించి ధన్యులయ్యారు. వేద భాష్యకారులు మన పురాతన కాలం నంచి చాలామంది ఉన్నారు. ఈ కలియుగంలో శ్రీ విద్యారణ్యస్వామి, శ్రీ శంకర భగవత్పాదులు, స్వామి దయానంద సరస్వతి, శ్రీ అరవిందులు ముఖ్యులు.
ఇపుడు మన సమకాలికులు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్‌గారు ఆనాటి యుగపురుషుల పరంపరను మనకు అందించే ప్రయత్నంలో 3ఋగ్వేదం2 నూతన భాష్యం2 అనే గ్రంథాన్ని రచించి మన ముందుకు తెచ్చారు. చారిత్రక నవలా చక్రవర్తిగా పేరుగాంచిన వీరు కొత్త పంథాలో వేదాల భాష్యాలకు శ్రీకారం చుట్టారు. నక్షత శాస్త్రాన్ని, వేదవిజ్ఞానంతో అనుసంధానం చేస్తూ గ్రీకు, ఈజిప్టు, ప్రాచీన చైనా, భాల్డియా, పర్షియన్, రోమన్, హిబ్రూ, మస్లిం, క్రైసవం మతాలోని విషయాలను ఉటంకిస్తూ ప్రపంచంలో అన్నింటికి మన వేదాలే మూలం అనే సూత్రాన్ని సాంకేతికంగా, సశాస్ర్తియంగా నిరూపిస్తూ ఈ ఋగ్వేద నూతన భాష్యం వ్రాశారు. ఉపక్రమణికలో ప్రపంచ సాహిత్యంలో ప్రథ్రమ గ్రంథము ఋగ్వేదము. సరస్వతీనదీ తీరంలో వేల సంవత్సరాలకు ముందే ఉద్భవించినట్లు నిర్థారించారు. నక్షత్రాలు, రాశులు వాటితో సంబంధం వున్న పురాణ పాత్రలు వాటి గాథలు మాసాలు యుగాలు కాలగణన వివరించారు.
ఇక రెండవ భాగం వైవస్వత నౌక. వేదములు మూడు, నాలుగు, అయిదు భిన్న వాదాలను సూచించారు. రాముడు, హనుమంతుడు, ఋగ్వేదం చదివితే రాముని కాలము 17 లక్షల సంవత్సరాలు. మరి వేదకాలం వయసు ఎంత? ఋగ్వేదంలో 1017 సూక్తములు, 1058 మంత్రములు, 432000 అక్షరములు ఉన్నాయి. 116-182 సూక్తములలో అగస్త్య నౌక గురించి వ్రాసి ఉన్నది. అగస్త్య నౌక, ఆర్గోనావిస్ ఒక్కటే అని నిరూపించారు. హోలీ ఖురాన్‌లో ఆదమే ఖయామత్ నుంచి అల్లా రక్షించాడు అని చెప్పినది ఋగ్వేదం తరువాతనే అని నిరూపించారు.
భుజ్యప్రసక్తి, మత్స్యపురాణము, 182వ సూక్తమున గల అగస్త్యనౌక ప్రసక్తి సోదాహరణముగా వివరించారు.
అనుబంధం ఒకటిలో దయానంద వ్యాఖ్యానము, వైవస్వత వంశము వివరాలు తెలియజేశారు. నోవా వంశము చరిత్ర (బైబిలునుండి) వివరించారు. ఆర్గోనాట్స్‌లోనిపాత్రల పరిచయము మరియు ఆర్గో పేర్లు వాటికి భారతీయ నామములు సరైన నక్షత్ర సంకేతములను తెలియపరిచారు. గ్రీకు పురాణంలోని చిరాన్ చిరంజీవి గురించి వ్రాశారు. అశ్వత్థామ ఇగ్యులెన్స్ అనే గ్రీకు నక్షత్ర నామం భారతంలో అశ్వత్థామ కుంభ సంభవుని పుత్రుడు. అంటే కుంభరాశి అని వివరించారు.
అగస్త్యుడు ఈజిప్టు పురాణంలోని ఆ సిరిస్‌కు పోలికలు చూపారు. ఋగ్వేదములో అగస్త్య దర్శనలో 24 సూక్తాలు. అనామకుడిగా భావించిన అగస్త్య భ్రాత అసలు పేరు సుతీష్ణుడు. అగస్త్యుని పేరుతో నాడిగ్రంథం ఉంది. ఇస్లాంలోని ఖయామత్ గురించి చర్చించారు. ప్రస్తుతము జరుగుతున్న వైవస్వత మన్వంతరం. దానికి మూల పురుషుడు వివస్వతుడు. అదితి-కశ్యపుల పుత్రుడు. ఇతని సంతానమే వైవస్వతుడు. డ్రాగన్ గురించి కూడా సమాచారము పొందుపరచారు. చైనా ఖోగోళ ద్వాదశరాశి చక్రంలో డ్రాగన్‌కు స్థానం ఉన్నది. అజార్ డ్రాగన్ ఆకాశంలో నాలుగు రక్షక జంతువులలో ఒకటి. నాలుగు ఋతువులకు సంకేతం. అలాగే సౌర కుటుంబాల గురించి భారతీయ శాస్తజ్ఞ్రుల, విదేశీయులైన కాప్రీ మార్చ్ పరిశోధనల గురిచి వివరించారు. ఇక ఆఖరుగా అనుబంధములో పండితులారా బహుపరాక్ అని హెచ్చరిస్తూ క్రైస్తవ మత ప్రబోధకులు చెప్పే ఉపన్యాసాలు ఉదాహరించారు. నాలుగు వేదాల సారమూ ప్రజాపతి అయిన ఏసుక్రీస్తు నాధుణ్ణి మనమంతా దైవముగా ప్రార్ధిద్దాం అని. క్రీస్తు విదేశీ దేవుడు కాదు అని విచిత్రమైన ప్రకటనలు హిందూ జాతి గుర్తించి జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించారు.
భారతీయులమైన మనం మన సంస్కృతిలోని గొప్పతనాన్ని మరచిపోకూడదు. వేదవ్యాసులవారు అందించిన ఈ నాలుగు వేదాల సారాంశాన్ని దాని ద్వారా మనం పొందే ఆధ్యాత్మిక, పారమార్థిక సత్యాలని ఈ జాతి పొంది ప్రపంచ దేశాలకు తెలియజేసి గురుస్థానంలో నిలబడాలి.
ఆఖరుగా ఒక్కమాట. నేటి సమాజంలో ఎంతోమంది ధనికులు, వారందరూ గొప్పవారు కాదు. ఎవరైతే ఇలాంటి పవిత్ర కార్యాలకు సహాయం చేస్తారో వారే నిజమైన గొప్పవారు. డా. విజయకుమార్‌గారు తన దాతృత్వంతో ఈ గ్రంథాన్ని అంకితం చేసుకుని ధర్మరక్షణకు కంకణం కట్టుకున్నారు. చాలా గొప్ప విషయం. ఈ గ్రంథాన్ని ఎంతో ఇష్టంతో, కష్టపడి వ్రాసిన ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్‌గార్కి అంకితం తీసుకొన్న డా. ఎ.విజయకుమార్‌గారికి ఆ వేదవ్యాసులవారి కృపాకటాక్ష వీక్షణలు కలిగి ఆయుఆరోగ్యాలతో పదికాలాలపాటు సమాజాన్ని జాగృతం చేయాలి అని మనసారా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.

-జన్నాభట్ల నరసింహప్రసాద్