పఠనీయం

జమునా -రమణా నీకెవ్వరు సరిరారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమునా - రమణా
రచన: డా. అక్కిరాజు సుందర రామకృష్ణ
ప్రతులకు
సంప్రదించవలసిన
చరవాణి: 98850-20205
*
దాదాపు 60 సంవత్సరముల క్రితం ఒకరోజు ఆంధ్రదేశంలోని దినపత్రికలో ఒక ప్రకటన వెలువడింది. మేము నిర్మించబోయే సినిమాలోని ప్రఖాత కథానాయిక పక్కన నాయకునిగా నటించడానికి అజానుబాహువు, స్పురధ్రూపి, అయిన యువకుల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తున్నాము అని నిర్మాతలు కోరారు. దీనికి ప్రతిస్పందనగా వచ్చిన వందలాది అభ్యర్థుల నంచి ఎన్నికైన వారే శ్రీ జూలూరు వేంకట రమణారావు గారు. అప్పటి ప్రముఖ కథానాయకి కుమారి జమున గారికి తగిన వరుని కొరకు ఏర్పాటు చేసిన ఈ పత్రికా స్వయంవరం ద్వారా ఎన్నుకోబడ్డ జమున గారి నిజ జీవిత కథానాయుకుడు సరిజోడు వీరే. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అందుకే జమునగారు జమునా రమణారావుగా ప్రసిద్ధి కెక్కారు.
డా. అక్కిరాజు సుందర రామకృష్ణ గారు కవి, గాయకులు. రంగస్థల నటులు, పరిశోధకులు, అధ్యాపకులు, వ్యాఖ్యాత, సినిమా, బుల్లి తెర నటులు, హరికథకులు, ఆశుకవిత్వ అవధాని..ఇలా వారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. కనుక ఇవన్నీ వెరసి బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవచ్చు. శ్రీమతి జమున గారు సత్యభామగా సుందర రామకృష్ణ గారు కృష్ణ ప్రాతధారిగా వందలాది ప్రదర్శనలు దేశమంతటా ప్రదర్శించారు. అందుకని జమునగారిపై ఉన్న గౌరవ భావనతో పంచశతికి కందపద్యాలను జమునా- రమణా అనే మకుటంతో రచించి ప్రచురించడం శ్రీ ఆక్కిరాజు వారి ఉత్తమసంస్కారానికి నిలువెత్తు సాక్ష్యం.
కథతోనిమిత్తం లేకుండా ఒక భావాన్ని లేదా ఒక అభిప్రాయాన్ని తెలియజేయడానికివీలుగా చేసే వ్యవస్థ పద్యరచన. శతకం పద్య రచనాభ్యాసానికి అనువైన ప్రక్రియ. కందం రాసిన వాడే కవి అనే లోకోక్తి ప్రసిద్ధికదా. డా: అక్కిరాజు గారు ఈ పద్య ప్రక్రియలో ఉద్దండడు. ఆధునిక కాలానికి అనుగుణమైన శబ్దజాలాన్ని ఇతర భాషాపదలాతో కలిపి కందాల్లో బంతులు ఆడుకున్నారు కవిగారు. శ్రీముదిగొండ శివప్రసాద్ గారు అన్నట్టు సుందర రామకృష్ణగారి రచన కందము మా కందము మరందము ఇంకా మకరందరముకూడా.
వీరి కవిత్వముతో వేముల వాడ భీమకవి కవి సార్వభౌముడు శ్రీనాథుని వాడి తెనాలి రామకృష్ణ కవి చమక్కులు స్పష్టముగా దర్శనమిస్తాయి. వీరి పదప్రయోగ శరాఘాతము పదును తగిలిన వారికే తెలుస్తుంది. నిజాన్ని నిర్భయంగా కుండబద్ధలుకొట్టినట్లు మరికొన్ని చోట్ల కొండబద్ధలుకొట్టినట్లు చెప్పగల ధైర్యశాలి.
శ్రీరుక్మిణీశ కేశవ నారద సంగీత లోల నళినీ దళాక్ష అంటూ భక్తితో మొదలు పెట్టి సంఘంలో ఆడుగంటిన నైతిక విలువల పతనాన్ని వ్యక్తుల కుత్సిత్వ బుద్ధులను తన స్వీయ అనుభవంతో తెలుసుకొని బాధతో ఆక్రోశిస్తూ నర్మగర్భంగా పద్య బద్ధం చేస్తూ రచించడం వీరికే చెల్లింది.
ప్రాచీన కవులలో ఒకరైన కుంతకుని భావజాలమైన అభిద , లక్షణ, వ్యంజన వంటి అధిక్షేప వైఖరులను తన పద్యాలలో అందంగా పొందు పరిచిన సుందరాంగుడు అక్కిరాజు.
తనకు ఇష్టమైన కాంభోజి హంసధ్వని రాగాలను, అయ్యలరాజును, పింగళి సూరనను, దూర్జటిని, మాదన గారి మల్లనను, జాషువాను స్తుతించారు. ఇక సంగీత నిధులైన శ్రీత్యాగరాజ స్వామి వారిని అసమాన గాన గంధర్వరులు శ్రీఘంటసాల గారిని, గానకోకిల సుశీలమ్మను సంగీత నిధి సాలూరి గారికి అంజలి ఘటిస్తూ కొనియాడారు. తన అభిమాన నటులు ఎస్.వి.ఆర్, ఎన్.టి.ఆర్ హస్యనటుడు శ్రీరేలంగిని గుండమ్మ పాత్రకు మరోపేరైన సూర్యకాంతమ్మను పేర్కొన్నారు.
చవటలను ప్రోత్సహింతురు
జవమూ జీవంబులున్న సహనటులున్నన్
నవలా వారికి ధడ... అంటూ తన నటనా సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోలేక పోయిన సినిమా రంగంలోని పక్షపాత బుద్ధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తినలేని బీద బిక్కుకు
తృణమో లేక బణమో ప్రేమనొసంగన్...
అంటూ సమాజంలోని నిరుపేదలకు అభాగ్యులకు తమకు చేతనయిన సహాయం చెయ్యాలని హితవు చెప్పి తనలోని గుప్తదాన గుణాన్ని తెలియపర్చారు.
ఇక జమున గారి గురించి అన్నుల మిన్నన, వనె్నల దొరసానివనీ,.. కన్నులలో దాచుకుందు నినే్న నా స్వామి.. నిలువవే వాలుకనుల దానా అంటూ పగలే వెనె్నలా అన్నా ఒక్క జమునా రమణారావుగారికే చెల్లింది. నను భవదీయదాసుని క్షమించు అని శ్రీకృష్ణుడు ప్రాథేయ పడగానే తన అవివేక కోపానికి లోకరక్షకుని గురిచేశాను అనే పశ్చాతప్తహృదయావేదనతో శోకరసాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. సినీ పరిశ్రమలో స్వాభిమానం, అభిజాత్యం గల నటి జమునగారే . చిత్ర పరిశ్రమలో ఎన్నో ఒడిదొడుకులను, వర్గ వైషమ్యాలను ఎదుర్కొని దాదాపు అర్థ శతాబ్దం పాటు తన దైనశైలిలో నటనతో ప్రేక్షకసృదయాల్లో చెరగని ముద్ర వేసిన కళాభినేత్రి ప్రజానటి జమునగారు. తన 80వ సంవత్సరంలోకూడా ‘మీరజాలగలడానా ఆనతి...’ అంటూ ఇటీవల తన జన్మదినోత్సవా సందర్భంగా ఆమె ప్రదర్శించిన నటన అద్భుతం. అనిర్వచనీయం. అమోఘం అంటూ కొనియాడారు.
ఈ గ్రంథరాజాన్ని ప్రముఖ రంగస్థల నటులు శ్రీవిన్నకోట రామన్న పంతులు గారి అల్లుడు నంది అవార్డు గ్రహీత శ్రీకొండపర్తి వేంకటేశ్వర్లు గార్కి, ప్రఖ్యాత రంగస్థల నటులు శ్రీ అయ్యదేవర నరసింహ పురుషోత్తమరావుగార్లకు అంకితం ఇవ్వడం ఎంతోసముచితం.

- జన శ్రీ 7995900497