పఠనీయం

అందరినీ అలరించే హాస్య వ్యంగ్య నవల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వట్టి చేతులు
హాస్య వ్యంగ నవల
రచన: కలువకొలను సదానందం
వెల: రూ.100/-
ప్రతులకు:
విశాలాంధ్ర
మరియు
నవచేతన బుక్ హౌస్ వారి అన్ని బ్రాంచీలు
*
బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన వారిలో కలువకొలను సదానందంగారిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. కథలు, నవలలు, వ్యాసాలు, కవితలు, బాలల గురించి కథలు, గేయాలు, కార్టూన్‌లు, నవలలు రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అవార్డులు, రివార్డులు గెలుచుకున్నారు. ఎనభై సంవత్సరాల వయసులో కూడా సదానందంగారి కలం మొక్కవోలేదు అనటానికి గత నెల ప్రచురించిన ఈ హాస్య, వ్యంగ్య నవల ‘వట్టి చేతులు’’ను చెప్పుకోవచ్చును.
గేయాలు, కథ మేళవించిన ఈ బాలల నవలలో సదానందంగారు పిసినారితనాన్ని, లోభత్వాన్ని విరహించారు. ఎంతటి పిసినారితనంతో బ్రతికున్నప్పుడు ఎంత కూడబెట్టినా, మరణించినాక వెంట ‘‘చీపురు పుల్ల’’ కూడా తీసుకుని వెళ్లలేరని చెప్పారు.
యమపురి నుండి, మర్కట ముష్టి మరియు భల్లూక ముష్టి అను ఇద్దరు యమభటులు భూలోకంలోని, పాతకాల పుట్ట అనే గ్రామంలో చీపురుపల్లి వరహాలయ్యను, ఒక కోడిపిల్లను నరకానికి తేవటానికి బయలుదేరుతారు. కోళ్లపాక అన్నమయ్య, ఆత్మారాముడు, వరహాలయ్య కుమారుడు వెండి రూపాయి, భార్య వరాలమ్మ, కోడలు చిలకమ్మ, దోపిడీదొంగలు మోస భళి మరియు వేషభళి, కనకదాసు అనబడిన దొంగ బాబా పాత్రలు పరిచయం చేయబడుతాయి. వరహాలయ్య, మరణించినా, ఆయన ఆత్మ ఇంట్లోని డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటుంది. అపర కర్మలలో కొడుకు వెండి రూపాయి పెట్టే డబ్బు, వ్యయానికి వరహాలయ్య ఆత్మ‘లబలబ’లాడుతుంది. వట్టి చేతులతో చివరకు వరహాలయ్య ‘నరకం’లో ప్రవేశించటంతో నవల ముగుస్తుంది.
చేయి తిరిగిన రచయిత, బాలురనుద్దేశించి రాసిన ఈ నవల ఆద్యంతమూ హాస్యాస్ఫోరకమై పిన్నలను, పెద్దలను అలరిస్తుంది.కథ నలుగురికి తెలిసిందే అయినా కథనంలో తన చాతుర్యాన్నంతా రచయిత చూపగలిగారు.
మచ్చుకి కొన్ని:
పిసినారి వరహాలయ్య గుండె ‘లబ్బుడబ్బు’ అని కొట్టుకోకుండా, ‘‘డబ్బు డబ్బు’’ అని కొట్టుకుంటోందట (ప.26)! ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని వరహాలయ్య ఇల్లు కనుక్కోవటం ఈ యమభటులకు కష్టమైన పని కాలేదు. మధ్యాహ్న భోజనాల వేళ కాకులు వాలని పెరడును చూసి ఇదే వరహాలయ్య ఇల్లు అన్న నిర్ణయానికి వస్తారు. (పే.41). ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు. కనుక ‘‘ఈతాకు అన్న బిరుదును వరహాలయ్యకు ఇవ్వాలనుకోవటం (పే.43). బాగుంది. ప్రతి అధ్యాయం మొదట పిల్లలు పాడుకోగలిగిన నీతి పద్యాలు, అంతర్లీనంగా కనిపించే నీతి పాఠకులను అలరింప జేస్తుంది. పిల్లలు, పెద్దలు చదివి ఆస్వాదించగల నవల ఇది. *

-కూర చిదంబరం ఫోన్: 8639338675