ఆంధ్రప్రదేశ్‌

మార్పు కోసం జనసేనకు అవకాశం ఇవ్వండి:పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: దోపిడి, అవినీతికి వ్యతిరేకంగా జనసేన పోరాటం చేస్తుందని, మార్పు కోసం జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన గుంటూరులో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్, ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. తాను సీఎం అయిన తరువాత అరవై ఏళ్లు నిండిన ప్రతి రైతుకు రూ.5వేలు ఫెన్షన్ అందించే దస్త్రంపైనే సంతకం పెడతానని అన్నారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కింద ఎకరాకు రూ.8వేలు అందజేస్తామని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే ఆరు నుంచి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని చెప్పారు.