రాష్ట్రీయం

11 దేవాలయాల ఉద్యోగులకు పిఆర్‌సి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, నవంబర్ 21: రాష్ట్రంలో 11 ప్రధాన దేవాలయాల ఉద్యోగులకు పే రివిజన్ కమిషన్ (పిఆర్సీ) అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాలయ ఆదాయాల్లో 30 శాతం కన్నా తక్కువ ఖర్చు ఉన్న ప్రధాన దేవాలయాలు సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, పెనుగంచిప్రోలు, మహానంది, విశాఖపట్నం కనకమహాలక్ష్మి, కస్సాపురం ఆంజనేయ స్వామి ఆలయాల ఉద్యోగులకు పిఆర్సీ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండురోజుల్లో ఇందుకు సంబంధించి జివో విడుదలవుతుందన్నారు.