అక్షర

పెద్ద్భిట్ల కథల శిశిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిశిరవేళ (కథాసంపుటం)
పెద్ద్భిట్ల సుబ్బరామయ్య
వెల: రు.120/-
ప్రతులకు: నవచేతన
పబ్లిషింగ్ హౌస్
హైద్రాబాదు
నవచేతన బుక్‌హౌస్
ప్రజాశక్తి శాఖలు

ప్రముఖ కథారచయిత పెద్ద్భిట్ల సుబ్బరామయ్య రాసిన 18 కథలతో ఈ సంపుటం వెలువడింది. జీవిత సత్యాలను పలురకాలుగా ఈ కథలలో విశే్లషించారు.
పుస్తకంలోని కథలలో ‘తాతిగాడి చొక్కా’ కథలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. పదిపనె్నండేళ్ల వయసున్న తాతిగాడు, కష్టపడి డబ్బులు సంపాదించుకునే, బుద్దిమంతుడైన కుర్రాడు. ఒకరోజు పొద్దున, రోడ్డుమీద కొందరు పెద్దమనుషులు, అతడు చేయని తప్పుకు బాగా కొట్టి, పోలీసులకు అప్పగిస్తారు. రాజకీయ నాయకులు రెచ్చిపోయే ప్రసంగాలు చేసినప్పుడు, వింటున్న జనం బస్సులు తగలబెట్టటం మనకు తెలిసిందే. పది మంది జనం ఒకచోట చేరినప్పుడు విచక్షణాజ్ఞానం కోల్పోతారనే సంగతిని ఈ కథ తెలియచేస్తుంది.
పచ్చటి పంటపొలాలతో జీవకళ ఉట్టిపడుతున్న పల్లెటూరి జీవితాన్ని ‘డబ్బు మొక్క’ కథలో వర్ణించిన విధానం చక్కగా ఉంది. ఊరి చుట్టూ పరిశ్రమలు ఏర్పడటంతో, ఊరుకాస్తా పట్టణంగామారి జీవరహితంగా ఉందని కథను ముగించారు.
‘నీకు భార్యనవుతాను’ కథ ఆలోచించతగ్గది. భార్యాభర్తలుగా అనుబంధాలు పెంచుకోవటంకన్నా స్నేహితులుగానే మిగిలిపోవటం గౌరవప్రదంగా ఉంటుందని ఈ కథను ముగించారు.
సృష్టిలో ప్రతి జీవికి బతకాలనే ఉంటుంది. మనిషికి మాత్రమే ఆలోచించే శక్తి ఉంటుంది కాబట్టి, ఏదైనా తట్టుకోలేని పరిస్థితులలో ఆత్మహత్యకు పాల్పడుతుంటాడు. ‘జబమాలై ఆత్మహత్య’ కథలోని ఇతివృత్తం ఇదే. తేలికగా చావటంకోసం డాక్టరు దగ్గర మాత్రలు తీసుకొని వెళ్లిన ‘జబమాలై’అనే వ్యక్తి, మూడురోజుల తరువాత డాక్టరు దగ్గరకు వచ్చి, ‘నాకు బతకాలని ఉంది’ అని చెప్తాడు. కథాంశం ఆలోచించతగ్గది. కళాశాల విద్యార్థులు అప్పుడప్పుడూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న వార్తలు మనం చదువుతుంటాం. మనను పాలించే ప్రభువులూ చదువుతారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటానికి కారణాలను అనే్వషించి, నివారణ చర్యలు తీసుకోవాలని ఈ కథ సూచిస్తుంది.
శివుడి ఆజ్ఞలేనిదే చీమయినా కుట్టదు- అనే జాతీయం గుర్తుచేసే కథ ‘నష్టజాతకుడు’. ఆత్మహత్య చేసుకోవాలని స్థిర సంకల్పంతో, విషం కలిపిన మందుసీసాను సిద్ధంచేసుకొని కూచున్న మనిషికి, ఆఖరి నిముషంలో అనుకోకుండా నిద్రపట్టి బతికి బట్టకట్టటం ఇందులోని కథాంశం. కథకిచ్చిన ముగింపు ఆసక్తికరంగా ఉంది.

- మార్తి వెంకటేశ్వరశాస్ర్తీ