Others

పెళ్లిచేసి చూడు - నాకు నచ్చిన సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ పెళ్లి, వరకట్నపు పెళ్లి, అనుకోకుండా చేసుకునే పెళ్లి ఇలా మూడు పెళ్లిళ్ల బొమ్మలాటచుట్టూ అల్లిన వృత్తం ‘పెళ్లిచేసి చూడు’ ఆరోగ్యకరమైన హాస్య వ్యంగ్య దృశ్య శ్రావ్యకావ్యమిది. ఇందులో వరకట్నం సమస్య. అయితే నినాదాలు లేవు, ఉపన్యాసాలు లేవు, బీభత్సాలు లేవు, సరదాగా సాగిపోయే ఈ చిత్రంలో సాంఘిక స్పృహ ఉంది. కట్నాల మోజులో యువకుల జీవితాలనే బలిచేసి కాపురాలు కూల్చు ఘనులకు ఈ సినిమా తగిన పాఠం చెబుతుంది.
ఇందులో వెంకటరమణగా ఎన్టీఆర్, వియ్యన్నగా ఎస్వీ రంగారావు, రాజుగా జోగారావు, భీమన్నగా మహంకాళి వెంకయ్య పాత్రలు కలకాలం గుర్తుండేవే. పాటలన్నీ వినసొంపుగా ఉంటాయి. ప్రతీ పాత్ర, ప్రతీ మాట ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతముద్ర వేశాయి. చక్రపాణి గడుసుతనం ఎక్కడంటే వరకట్న సమస్య ప్రధానంగా ఉన్న ఈ చిత్రంలో ఎక్కడా ఏ పాత్ర చేత ‘కట్నం’ తీసుకోకూడదనిగానీ, తీసుకోమనిగానీ అనిపించలేదు. అయితే కట్నం కోసం జీవితాలు నాశనం చేయటంగానీ, నాశనం చేసుకోవటంగానీ చేయకూడదని పాత్రల నడవడి చేత కథాగమనం ద్వారా చూపించారు. అదే ప్రేక్షకులను వారికి తెలియకుండానే ప్రభావితం చేసింది. షుగర్ కోటింగ్‌తో మనకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా చేశారు. అదే ఈ సినిమా స్పెషాలిటీ. విశేషమేమిటంటే ఈ సినిమా ప్రారంభమైన 55 నిమిషాల తరువాత హీరో ఎన్టీఆర్ పాత్ర ప్రవేశిస్తుంది. ఆ రోజుల్లో కథే హీరో అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏంకావాలి. అదివరకు కొద్దిపాటి హాస్యరస ప్రధాన చిత్రాలొచ్చినా వాటిలో ఏవీ అంతగా ప్రేక్షకుల్ని రంజింపచేయలేకపోయాయి. వ్యంగ్యం (సెటైర్)తో కూడిన ఆరోగ్యకర హాస్యాన్ని మేళవించి, సాంఘిక చిత్రాల్ని జనరంజకం చేయవచ్చనే ధోరణికి అంకురార్పణ చేసింది పెళ్ళిచేసిచూడు. పాటల పందిరి ఈ చిత్రానికి ప్రధాన బలం. పదిహేడు పాటలున్న ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా ఘంటసాల జనరంజకమైన స్వరాల్ని సమకూర్చగా, పింగళి నాగేంద్రరావు, ఊటుకూరి సత్యనారాయణ సాహిత్యాన్ని అందించారు. కథ, స్క్రిప్టు బాధ్యతల్ని చక్రపాణి నిర్వహించారు. అందుకే ఇది నాకే కాదు, అందరికీ నచ్చే సినిమా.
-వెంకట్ అంగర, మండపేట