పెరటి చెట్టు

తొలి తెలుగు మహాకావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాషకి అత్యంత సహజమయిన ఛందస్సు ద్విపద. నన్నయ్యకన్నా పూర్వకాలంలో వేయించిన పొట్లదుర్తి - మాలెపాడు శాసనంలోనే ద్విపదగతి రగడ కనిపించిందని దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డిగారి లాంటి పరిశోధకులు రాశారు. ద్విపద తరువోజ (దరువోజ?) లోంచి పుట్టిందా, తరువోజే ద్విపద లోంచి పుట్టిందా అనే చర్చ మనకిక్కడ అప్రస్తుతం - వేలాది సంవత్సరాలుగా ద్విపద ప్రజల హృదయాల్లో తిష్ఠ వేసుకుని కూర్చుండి పోయిందనే వాస్తవమే మనకిక్కడ ప్రస్తుతం. దసరా పద్యాలు మొదలుకుని, శిలా శాసనాల వరకూ ద్విపద ఎదురులేకుండా ఏలింది. స్ర్తిల పదాలు మొదలుకుని, ‘కలవారి కోడలు కలికి కామాక్షి’ లాంటి పాటల వరకూ ద్విపద ప్రవేశించి, పాదుకోని రంగమే లేదు. అక్షరాలా అదే ద్విపద ఛందస్సులో రూపుదిద్దుకున్న మహాకావ్యమే ‘రంగనాథ రామాయణం’. ఇది తెలుగులో వెలువడిన తొలి ద్విపద కావ్యం మాత్రమే కాదు, బహుశా ఇదే మన భాషలో వెలువడిన తొలి సంపూర్ణ రామాయణ కావ్యం కూడా. రంగనాథ రామాయణానికి ప్రామాణిక ప్రతిని రూపొందించి ప్రచురించే సందర్భంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అప్పట్లో వైస్ ఛాన్సలర్‌గా ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి ఓ విషయం ప్రత్యేకించి ప్రస్తావించారు. రంగనాథ రామాయణం రాయలసీమ జిల్లాల్లో విశేష ప్రాచుర్యానికి నోచుకుందని ఆయన చెప్పారు. నిజానికి, ఈ ద్విపద రామాయణం తెలంగాణ ప్రాంతంలో కూడా సుప్రసిద్ధం. ఇక తోలుబొమ్మలాట కళారూపం కోస్తా జిల్లాల్లో వ్యాప్తిలో ఉన్న రోజుల్లో ఈ రామాయణం ‘బొమ్మలాట రామాయణం’గా ప్రసిద్ధం. దీనిని గోన బుద్ధారెడ్డి - పదమూడు, పధ్నాలుగు శతాబ్దుల సంధికాలంలో - రాశాడన్నదే సాహిత్య లోకంలో ప్రచురంగా ఉన్న అభిప్రాయం. ఈ ద్విపద రామాయణం ప్రాచీన ప్రతుల్లో ఎక్కడా రంగనాథుడి ప్రస్తావన కనిపించలేదని సి.పి.బ్రౌన్, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, మల్లంపల్లి సోమశేఖర శర్మ తదితర పరిశోధక పండితులు ఎన్నడో స్పష్టం చేశారు. ఈ ద్విపద రామాయణాన్ని మొదట్లో ‘రామాయణం’ అని మాత్రమే అనేవారని వాళ్లు వివరించారు.
రంగనాథుడనే కవి, ఈ ద్విపద కావ్యాన్ని రాయగా బుద్ధారెడ్డి అతని దగ్గిర్నుంచి దాన్ని కొనుక్కున్నాడని ఓ వర్గం సాహిత్య చరిత్రకారుల వాదన. రంగనాథ రామాయణ కావ్యాన్ని ‘సరిచూచి పీఠిక వ్రాసి యిమ్మని’ ప్రచురణకర్తలు కోరగా ‘సమాలోచనము’ పేరిట సుదీర్ఘమయిన ఉపోద్ఘాతం రాసిన జనమంచి వేంకట సుబ్రహ్మణ్యేశ్వర శర్మ ఇదే అభిప్రాయం గట్టిగా ప్రకటించారు. అయితే, ఆయన కానీ, మరే ఇతర సాహిత్య చరిత్రకారుడు కానీ, ఈ రంగనాథుడు ఎప్పుడు, ఎక్కడ పుట్టి పెరిగి, ఎందుకని ఈ కావ్యం బుద్ధారెడ్డి పేరిట రాశాడో ఇంతవరకూ సాధారంగా చెప్పలేదు. అలాంటి విషయం బయటపడిన నాడు దాని గురించి చర్చించుకుందాం. అందాకా, ఈ రామాయణం కర్తృత్వం బుద్ధారెడ్డిదేనని పరిగణించడం ఉచితం. కాగా, కాకతీయుల సామంతుడయిన బుద్ధారెడ్డి - ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాలుగా ఉన్న - కందూరు సంస్థానాన్ని పాలించాడట. నిండు పేరోలగంలో, తండ్రి తనను రామాయణ కావ్యం రాయమని ఆదేశించగా తను దాన్ని శిరసావహించానని బుద్ధారెడ్డి స్వయంగా చెప్పాడు. ఈ ద్విపద రామాయణ కావ్యం పూర్వ భాగాన్ని అతను రాయగా, ఉత్తర రామాయణ భాగాన్ని అతని కుమారులు కాచయ్య, విఠలనాథయ్య రాశారని అందులోనే ఉంది.
దాదాపు రెండు దశాబ్దాల కిందట, అయ్యప్ప పణిక్కర్ సంపాదకత్వంలో కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురించిన ‘మధ్యయుగాల నాటి భారతీయ సాహిత్యం - అధ్యయనాలూ ఎంపికలూను’ (ళజూజళ్ప్ఘ నిశజూజ్ఘశ జజఆళ్ఘూఆఖూళ డఖ్పూళూకఒ ఘశజూ డళళషఆజ్యశఒ’) అనే పుస్తకంలో గో(కో)న బుద్ధారెడ్డే రంగనాథ రామాయణం రాశాడని స్పష్టంగా చెప్పారు జి.వి.సుబ్రహ్మణ్యం. పదమూడో శతాబ్దిలో తెలుగు సాహిత్యం ఓ మూల మలుపు తీసుకుందని చెప్తూ, స్వతంత్ర కావ్యాలుగా రూపుదిద్దుకున్న ‘రంగనాథ రామాయణం’, ‘్భస్కర రామాయణం’ ఈ పరిణామానికి ప్రతీకలని కూడా చెప్పారాయన. (‘్భస్కర రామాయణం’ కూడా హుళక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, రుద్రదేవుడు అనే ముగ్గురు కవుల బృందం చేసిన రచనే కావడం కాకతాళీయం!) మహాభారతాన్ని ఇతిహాసమనీ, భాగవతాన్ని పురాణమనీ, రామాయణాన్ని కావ్యమనీ ప్రస్తావించుకునే ఆనవాయితీని ప్రస్తావిస్తూ, తెలుగు సాహిత్యం తీసుకున్న ఈ మలుపుతో ‘మహాకావ్య యుగం’ మొదలయిందని సుబ్రహ్మణ్యం అంటారు. నిజానికి, కవిత్రయ మహాభారతంతోనే ఈ మహాకావ్య యుగం మొదలయిందేమో!? నన్నయ్య, తిక్కన్న, ఎర్రన కూడా వ్యాస భారతాన్ని యథాతథంగా అనువదించలేదు కదా. ఒక్కో పర్వాన్ని ఒక్కో పౌరాణిక కావ్యంగానే అనువదించడం నన్నయ్య, తిక్కన్న ఇద్దరూ చేసిన పనే. ఎటొచ్చీ, వారి రచనలు ‘ప్రామాణిక’ పౌరాణిక రచనలుగా రూపుదిద్దుకున్నాయి. రంగనాథ రామాయణం ప్రజా సామాన్యం నాల్కల మీద నాట్యమాడే ద్విపద లాంటి ఛందస్సులో విరచితమయింది. అంతే తేడా.
బుద్ధారెడ్డి బృందం ఈ ద్విపద కావ్యంలో లెక్కకు మిక్కిలిగా ‘అవాల్మీకాలు’ చొప్పించారు. రంగనాథ రామాయణంలో కనిపించే ఇంద్రుడు - గౌతముడు - అహల్యల కథ వాల్మీకి రచనకు విధేయంగా లేదని ఎందరో చెప్పిన విషయమే. ఎవరో అన్నట్లు, తెలుగు వాళ్లు రాముడి గురించి చెప్పుకునే కథలూ గాథల్లో అత్యధికం వాల్మీకి రాసి వుండనివే! వాటిల్లో అత్యధికం ద్విపద రామాయణం ద్వారా వ్యాప్తిలోకి వచ్చినవే. ముఖ్యంగా, కిష్కింధా కాండలోని కథలనేకం బుద్ధారెడ్డి కల్పించినవేనంటారు. జంబుమాలి, కాలనేమి, సులోచనల కథలు పూర్తిగా స్వతంత్ర కల్పనలేనని గిడుగు సీతాపతి ‘హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్’లో స్పష్టం చేశారు. అవే కాదు, కైకేయి మూడు వరాల వృత్తాంతం, యుద్ధరంగంలో కుంభకర్ణ - విభీషణ సంవాదం లాంటివి కూడా బుద్ధారెడ్డి కల్పనలే! ప్రత్యేకించి చెప్పవలసిన విషయాలు రెండున్నాయి. ‘ఊర్మిళా దేవి నిద్ర’ ‘లక్ష్మణ దేవర నవ్వు’ (లక్ష్మణుడి మూర్ఛ) స్ర్తిల పాటలుగా సుప్రసిద్ధం. ఇవి రంగనాథ రామాయణంలో చోటు సంపాదించుకో గలిగాయి. నిన్న మొన్నటి వరకూ గ్రామీణ ప్రజానీకం సాంస్కృతిక ప్రపంచంలో ప్రముఖమయిన స్థానం ఆక్రమించుకుని వుండిన (తోలు) బొమ్మలాట కళాకారుల ద్వారానే ఈ కథలూ గాథలూ జన జీవితాల్లోకి ప్రవేశించి, పాతుకు పోయాయనే వాదన కూడా ఉంది. బుద్ధారెడ్డి తన రామాయణ కావ్యంలో రావణుడి కుటుంబం పట్ల ద్రావిడ దృక్కోణం ప్రసరింపచేశాడని కట్టమంచి రామలింగారెడ్డి చెప్పిన మాట అక్షర సత్యం. అంతమాత్రాన వాల్మీకి రామాయణంలోని ప్రసిద్ధ ఘట్టాలు వేటినీ బుద్ధారెడ్డి వదిలేయలేదు. ఉదాహరణకి ‘త్రిజటా స్వప్నం’ లాంటి వృత్తాంతాలను ఆయన యథోచితంగా అనువదించారు. ఈ వృత్తాంతం ద్వారా వాల్మీకి సీతను శక్తిరూపంగా చూపించాడని కొందరూ, ఇందులో మార్మికంగా గాయత్రీ మంత్ర రహస్యం వివరించాడని మరి కొందరూ అంటారు. అలాంటి భాష్యాల జోలికి పోకుండా బుద్ధారెడ్డి ఈ ఘట్టాన్ని ఉన్నదున్నట్లుగా మనముందుంచారు. చివరిగా ఒక మాట - నెట్‌లో రంగనాథ రామాయణం దొరుకుతోంది. ఆసక్తి ఉన్నవాళ్లు -
https://archive.org/ stream/RanganathaRamayanamu /Ranganatha%20Ramayanamu#page/n5/mode/2up అనే లింకులో ధాన్ని చూడొచ్చు.