రాష్ట్రీయం

నా భర్తకు రక్షణ కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మగ్లర్ గంగిరెడ్డి భార్య పిటిషన్
హైదరాబాద్, నవంబర్ 28: ‘కొందరు వ్యక్తులతో నా భర్త ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. జైలులో ఉన్న నా భర్తకు రక్షణ కల్పించాలి. వెంటనే అతనిని హైదరాబాద్ సెంట్రల్ జైలుకు తరలించాల’ని కోరుతూ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి భార్య మాళవిక హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు శనివారం హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసినట్టు విలేఖరులకు చెప్పింది. ఇటీవల మారిషస్‌లో అరెస్టయిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తన భర్తకు ఆంధ్రా పోలీసులతో ప్రాణ హాని ఉందని, సిఎం చంద్రబాబు నాయుడుపై మావోయిస్టులు జరిపిన దాడితో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తెలిపింది. తన భర్తకు ఎలాంటి హాని తలపెట్టొదంటూ హైకోర్టును ఆశ్రయించినట్టు ఆమె పేర్కొంది. కడప సెంట్రల్ జైలు నుంచి తెలంగాణలోని ఏ జైలుకైనా తరలించాలని ఆమె కోరింది.