బిజినెస్

మా అమ్మను అడుగుతాను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆండ్రాయిడ్ ఒఎస్ వెర్షన్ల పేరుపై విద్యార్థుల ప్రశ్నలు
సరదాగా సమాధానమిచ్చిన గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: మళ్లీ అదే సీన్ రిపీటైంది. నాడు ఫేస్‌బుక్ సిఇఒ మార్క్ జూకర్‌బర్గ్. నేడు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్.. విద్యార్థుల ప్రశ్నలకు తడుముకోవాల్సి వచ్చింది మరి. రెండు రోజుల పర్యటనలో భాగంగా పిచాయ్ భారత్‌లో పర్యటిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో రోజైన గురువారం ఇక్కడి ప్రతిష్ఠాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో విద్యార్థులతో పిచాయ్ కాసేపు మమేకమయ్యారు. ఈ సందర్భంగా అత్యంత ప్రజాదరణ పొందిన గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆండ్రాయిడ్ వెర్షన్‌ల పేరుపై ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. ఇటీవలి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఒఎస్) వెర్షన్‌కు ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో అని నామకరణం చేసిన నేపథ్యంలో కొందరు విద్యార్థులు విదేశీ ఆహార పదార్థాల పేర్లేనా? భారతీయ ఆహార పదార్థాల పేరును పెట్టరా? అంటూ పిచాయ్‌ని ప్రశ్నించారు. కొందరు పేడా, నెయ్యప్పం, నంకతాయ్ అంటూ ఆహార పదార్థాల పేర్లను సూచించారు. దీంతో కంగుతిన్న పిచాయ్ ‘మా అమ్మను కలిసినప్పుడు నేను అడుగుతాను.’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతేకాదు చిన్నపిల్లాడిలా నేను పాయసంతో సాంబార్‌ను కలుపుకుని తిననని, ఎందుకంటే ఆ పాయసం రుచిగా ఉండదన్నారు. దీంతో ఆకర్షణీయంగా ఉండే పేర్లనే ఎంచుకుంటామన్న అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు పిచాయ్. గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ ఒఎస్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఎన్ పేరును అనే్వషిస్తున్న క్రమంలో ఈ ప్రశ్న విద్యార్థుల నుంచి వినిపించింది. కాగా, ఆండ్రాయిడ్ ఎన్ పేరు కోసం గూగుల్ ఆన్‌లైన్ పోల్‌ను కూడా నిర్వహిస్తుందని సుందర్ పిచాయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదిలావుంటే ఇంతకుముందు ఆండ్రాయిడ్ ఒఎస్ వెర్షన్ల పేర్ల కోసం కూడా డోనట్, ఎక్లెయిర్, జింజర్‌బ్రెడ్, ఐస్‌క్రీమ్ సాండ్‌విచ్, జెల్లి బీన్, కిట్‌క్యాట్, లాలీపప్ తదితర పేర్లను సూచించారు. విద్యార్థులతో గంటపాటు జరిగిన సుందర్ పిచాయ్ ఇష్టాగోష్ఠి.. అక్టోబర్‌లో భారత్‌కు విచ్చేసిన సందర్భంగా ఢిల్లీ ఐఐటిలో ఫేస్‌బుక్ సిఇఒ మార్క్ జూకర్‌బర్గ్ విద్యార్థులతో జరిపినదానిలాగే ఉత్సాహంగా, ఆసక్తికరంగా సాగింది. మరోవైపు ఈ కార్యక్రమానికి క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పిచాయ్‌తో సెల్ఫీ దిగిన భోగ్లే.. పిచాయ్‌ను టెక్నాలజీ పరిశ్రమలో ‘రాహుల్ ద్రవిడ్’గా అభివర్ణించారు. కాగా, సుందర్ పిచాయ్ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. బుధవారం అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్‌లను కలుసుకున్నది తెలిసిందే. (చిత్రం) విద్యార్థులతో మాట్లాడుతున్న సుందర్ పిచాయ్