Others
పిల్లల్ని తీర్చిదిద్దడంలో మాతృత్వపు మాధుర్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వ్యక్తిత్వ వికాసంతో పాటు నైతిక విలువలు అలవడేలా పిల్లల్ని పెంచడం తల్లుల బాధ్యత అని, వారిని అన్ని విధాలుగా తీర్చిదిద్దడంలోనే మాతృత్వపు మాధుర్యం దాగి ఉంటుందని ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే (40) అంటున్నారు. తల్లిగా తన కుమారుడి పెంపకంలో ఎదురైన అనుభవాలను, చవిచూసిన అనుభూతులను ఆమె ‘ది మోడర్న్ గురుకుల్’ పేరిట తాజాగా పుస్తక రూపంలో ఆవిష్కరించారు. ప్రస్తుతం పలు టీవీ షోల నిర్వహణలో బిజీగా ఉన్నప్పటికీ, పిల్లల పెంపకానికి సంబంధించి తన ఆలోచనలను పుస్తక రూపంలో అందరి ముందు ఉంచానని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నటిగా, తల్లిగా తన వ్యక్తిగత జీవితంలో సాధించిన విజయాలు, ఎదురైన సవాళ్లను ఆమె తన పుస్తకంలో పేర్కొన్నారు. తన కుమారుడు రణ్‌వీర్ (10) ఆలనాపాలనా చూసుకోవడంలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూనే నటిగా కృషిచేస్తున్నానని సోనాలీ వివరించారు. పెద్దలను గౌరవించడంలో, నైతిక విలువలను అలవరచుకోవడంలో తన కుమారుడు ముందంజలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని ఆమె అంటున్నారు. పసివాళ్లకు అన్ని విషయాలనూ తల్లులే శ్రద్ధతో బోధించాల్సి ఉంటుందని, ముఖ్యంగా పెద్దల పట్ల గౌరవ మర్యాదలను పాటించాలని వారికి అనునిత్యం చెబుతుండాలని తన పుస్తకంలో ఆమె వివరించారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి అన్ని విషయాలనూ ఇతరులకు చెప్పుకోలేకపోయినా, పిల్లల పెంపకంలో ఎదురైన అనుభవాలను పంచుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుందని ఆమె చెబుతున్నారు. రచయిత్రిగా రాణించాలన్న తపన తనలో ఎప్పటి నుంచో ఉందని, తన తొలి పుస్తకం పిల్లల పెంపకానికి సంబంధించినది కావడం ఎనలేని సంతృప్తిని కలిగించిందంటున్నారు. సినీతారలకు సంబంధించి పలురకాల విమర్శలు, వదంతులు వ్యాప్తి చెందడం సహజమేనని, అయితే తన అనుభవాలను పుస్తక రూపంలో రాసేందుకు ఏ మాత్రం అధైర్యపడలేదని సోనాలీ స్పష్టం చేస్తున్నారు. ఎవరో విమర్శిస్తారని భయపడకుండా ప్రతి మహిళా తన మనోభావాలను ధైర్యంగా ప్రకటించాలని ఆమె సూచిస్తున్నారు. ‘జీవితానుభవాలను అందరికీ చెప్పాల్సిన అవసరం ఏముంద’ని కొందరు ప్రశ్నిస్తుంటారని, అయితే చిన్నారులకు తెలియాల్సిన విషయాలను తల్లులు నిర్మొహమాటంగా చెప్పి తీరాలని ఆమె అంటున్నారు. ఆ విషయాలు ఇతరులకు మార్గదర్శకం అయ్యే అవకాశం ఉందంటున్నారు. పిల్లల పెంపకంలో ఎదురయ్యే సమస్యలపై ప్రతి తల్లికీ అవగాహన ఉండాలని, ఈ కోణంలో ఆలోచించే తాను పుస్తకాన్ని వెలువరించాలని సోనాలీ చెబుతున్నారు. తమ సంతానం ఉన్నత స్థాయికి చేరుకోవాలని తల్లులంతా తపన పడుతుంటారని, పెంపకం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే వారి కలలు సాకారమయ్యే అవకాశాలుంటాయని ఆమె సలహా ఇస్తున్నారు. పెద్దలను గౌరవిస్తూ, నైతిక విలువలతో పిల్లలు రాణిస్తుంటే తల్లులకు అంతకుమించి ఆనందం ఏముంటుందని ఆమె అంటున్నారు. *