హైదరాబాద్

పైప్‌లైన్ జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరి పైప్‌లైన్
పరిరక్షణకు చర్యలు
నాలుగు జిల్లాల కలెక్టర్లకు జలమండలి లేఖలు
గ్రామసేవకులను
బాధ్యులను చేసే యోచన
కరీంనగర్ ఘటనతో
కళ్లు తెరిచిన అధికారులు

హైదరాబాద్, మార్చి 17: ఎండలు మండిపోతున్నాయి..నగరవాసుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన మోతాదులో తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి. గోదావరి నుంచి తరలిస్తున్న అంతంతమాత్రం. మార్గ మధ్యలో పైప్‌లను ధ్వంసం చేసి జలచౌర్యం చేయటాన్ని జలమండలి సీరియస్‌గా తీసుకుంది. ప్రస్తుతం నగరంలోని జంట జలాశయాలు నీరు లేక పూర్తిగా ఎండిపోయిన తరుణంలో ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలపైనే అధికారులు, ప్రజలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో 3వేల ఎంఎం డయా సామర్థ్యం కల్గిన కేవలం ఒకే ఒక్క పైపు ద్వారా గోదావరి జలాలలు కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల మీదుగా నగరానికి 82 ఎంజిడిల నీరు నగరానికి చేరుతోంది. అయితే మార్గమధ్యంలో కొందరు గ్రామ ప్రజలు ఈ పైప్‌ను ధ్వంసం చేసి నీటి చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన జలమండలి అధికారులు దీన్ని అడ్డుకునే అంశంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇటీవలే గోదావరి జలాలను తీసుకువస్తున్న మొదటి దశ ప్రాజెక్టులో 3వేల ఎంఎం డయా ఎంఎస్ పైప్‌లైన్‌ను కరీంనగర్ జిల్లా ముర్మూకు సమీపంలోని పొట్యాల గ్రామానికి చెందిన కొందరు స్థానికులు ట్యాంపరింగ్ చేసి నీళ్లు దారి మళ్లించటంతో నగరంలోని పలు ప్రాంతాలకు 18 గంటల పాటు నీటి సరఫరా స్తంభించిన సంగతి తెలిసిందే! దీంతో కళ్లు తెరిచిన జలమండలి అధికారులు గోదావరి జలాలను తీసుకువచ్చే పైప్‌లైన్, అలాగే నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మీదుగా హైదరాబాద్‌కు మూడు దశలుగా 270 ఎంజిడిల నీరు నగరానికి తీసుకువచ్చే పైప్‌లైన్ల పరిరక్షణపై అధికారులు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి పైప్‌లైన్లు ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాయాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ డా.బి. జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు పైప్‌లైన్ వెళ్తున్న ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండే గ్రామసేవకుడ్ని బాధ్యుడ్ని చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో అన్ని విషయాలపై చక్కటి అవగాహన కల్గి, ఎక్కడ ఏ ఘటన జరిగినా తెల్సుకునేంత నెట్‌వర్క్ ఉండే గ్రామసేవకుడికి అవసరమైతే గౌరవ వేతనాన్ని కూడా చెల్లించి పైప్‌ల పరిరక్షణ చర్యలు చేపట్టేందుకు జలమండలి సిద్ధమైంది.
రూ. 3వేల కోట్లతో రెండు రిజర్వాయర్లు
ఆర్థిక సంస్థలతో కొనసాగుతున్న సంప్రదింపులు
వేసవికాలం నీటి కష్టాలను అధిగమించేందుకు నగరంలో నీటిని నిల్వ ఉంచేందుకు అదనపు రిజర్వాయర్లు అందుబాటులో లేకపోవటంతో నగర శివార్లలోని శామీర్‌పేట, రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలోని ఘనాపూర్‌ల వద్ధ రెండు రిజర్వాయర్లను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇందుకు స్థలాలను గుర్తించిన జలమండలి అధికారులు ఈ రెండు జలాశయాలను ఏర్పాటు చేసేందుకు సుమారు రూ. 3వేల కోట్ల వరకు ఖర్చవుతుందని పంపిన అంచనాల మేరకు ప్రభుత్వం హడ్కో, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ వంటి ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జలమండలి ఎండి జనార్దన్ రెడ్డి తెలిపారు. వేసవిలో నీటి కష్టాలు గతంలో మాదిరిగానే ఉంటాయన్న విషయాన్ని అంగీకరించిన ఆయన నగర అవసరాలకు ప్రతిరోజు 350 నుంచి 355 టిఎంసిల నీటిలో సుమారు 95 నుంచి 96 శాతం వరకు రొటీన్‌గా బోర్డు సరఫరా చేసే నీటి సరఫరా యదావిధిగా జరుగుతోందని వివరించారు. కానీ భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో బోర్ నీటిని వినియోగించే వారికి సరఫరా ఎక్కువగా రాకపోవటంతో వారు కూడా నల్లా నీళ్లపైనే ఎక్కువ ఆధారపడి ఉన్నందున, కొరత తీవ్ర స్థాయిలో కన్పించే అవకాశాలున్నాయని వివరించారు.