క్రీడాభూమి

పిచ్‌ని తవ్వేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాద వ్యతిరేక సంస్థ హెచ్చరిక
కోల్‌కతా, మార్చి 10: పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని, భారత క్రికెట్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే పిచ్‌ని తవ్వేస్తామని భారత అవినీతి వ్యతిరేక సంస్థ (ఎటిఎఫ్‌ఐ) హెచ్చరించింది. ముంబయపై ఉగ్రవాద దాడికి వ్యూహరచన చేసిన కుట్రదారులందరినీ భారత్‌కు పాకిస్తాన్ అప్పచెప్పాలని, అప్పటి వరకూ ఆ దేశంతో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించుకోరాదని డిమాండ్ చేసింది. ఏ పరిస్థితుల్లోనూ ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్తాన్ జట్టును మ్యాచ్ ఆడనివ్వబోమని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు వీరేష్ శాండిల్య స్పష్టం చేశాడు. ఈడెన్ గార్డెన్ వద్ద్భారీ ప్రదర్శనకు కూడా తాము సిద్ధమవుతున్నామని అన్నారు. సరిహద్దుల్లో ఉగ్రదాడులను ప్రోత్సహిస్తూ, భారత్‌ను అస్తిరపరచాలనుకుంటున్న పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలను ఎలా అంగీకరిస్తారని భారత ప్రభుత్వం, బోర్డులను నిలదీశాడు. సరిహద్దుల్లో వేలాది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోతుంటే, ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లు ఆడడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించాడు. టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈనెల 19వ తేదీన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హైవోల్టేజీ మ్యాచ్ ధర్మశాలలో జరగాల్సి ఉండింది. అయతే, ఆ మ్యాచ్‌కి భద్రతను కల్పించడం అసాధ్యమని పేర్కొంటూ కేంద్రానికి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భ ద్ర సింగ్ లేఖ రాయడంతో మ్యాచ్‌పై నీలినీడలు అలముకున్నాయ. దీనిని రాజకీయ కుట్రగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తాడు. ధర్మశాలలోనే మ్యాచ్ జరుగుతుందని మొదట్లో భరోసా ఇచ్చాడు. కానీ, అక్కడి వీర జవాన్ల కుటుంబాలు కూడా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ససేమిరా అనడంతో వౌనం వహించాడు. కాగా, మ్యాచ్‌ని కోల్‌కతా నిర్వహించేందుకు అనుమతించాలన్న బిసిసిఐ అభ్యర్థనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సానుకూలంగా స్పందించింది. ఫలితంగా ఈడెన్ గార్డెన్ వేదికగా మ్యాచ్ జరుగుతుందని బిసిసిఐ ప్రకటించింది. మ్యాచ్‌ని తిలకించేందుకు వచ్చే పాకిస్తాన్ అభిమానుల కోసం వీసాలో మార్పులు చేయడానికి కూడా అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో క్రికెటర్లు ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. కాగా మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఎటిఎఫ్‌ఐ తీవ్రంగా స్పందించింది. మ్యాచ్‌ని జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించింది.