రంగారెడ్డి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, డిసెంబర్ 5: పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతకు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని మేడ్చల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని మంజుషారాణి పిలుపునిచ్చారు. శనివారం పాఠశాలలో నగరంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ వారు విద్యార్థులు, ఉపాధ్యాయుల సహాయంతో పాఠశాల ఆవరణలో విరివిగా మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు పెంచడం వలన పరిశుద్ధమైన వాయువు లభిస్తుందని కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు. పచ్చదనంవల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించినందుకు బజాజ్ సంస్థ ప్రతినిధులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. స్వచ్ఛంద సంస్థలు సమాజానికి మేలుచేకూర్చే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ముదావహమని కొనియడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంద్రకంటి జ్యోతి, జ్యోత్స్న, స్వర్ణలత, భారతి, సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, దుర్గాప్రసాద్, అశోక్, మహిపాల్‌రెడ్డి, ఇంద్రజిత్ కుమార్, డివి రావు, విద్యార్థినులు పాల్గొన్నారు.