తెలంగాణ

గజ్వేల్, హైదరాబాద్‌లో భారీ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో 3 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. గజ్వేల్‌, హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలోని సభా ప్రాంగణాలను ఎన్‌ఎస్‌జీ అధికారులు పరిశీలించారు. బాంబుస్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌తో సోదాలు నిర్వహించారు. ఎల్బీస్టేడియం పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. 8 ప్రాంతాల్లో వాహనాలు మళ్లించనున్నారు. రేపు మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న మోదీ అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో 2.50 గంటలకు గజ్వేల్‌ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు గజ్వేల్‌లో మిషన్‌ భగీరథను మోదీ ప్రారంభించనున్నారు. సాయంత్రం 5.15గంటలకు ఎల్బీస్టేడియంలో బీజేపీ సభలో పాల్గొననున్న మోదీ సాయంత్రం 6.40 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.