రంగారెడ్డి

పొదుపు సంఘాలతో ఆర్థిక పురోగాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, నవంబర్ 29: ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఒక గ్రూపుగా ఏర్పడి రూపాయి రూపాయి జమ చేసుకున్నప్పుడే ఆ గ్రూపు అన్ని రంగాల్లో ఆర్థిక పురోగాభివృద్ధి సాధిస్తుందని రంగారెడ్డి జిల్లా తెదేపా అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఆప్కోకాలనీలోని శ్రీగాయత్రి పొదుపు సంఘం 15వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పొదుపులు చేసుకొని జమ చేసుకుంటే వారి అవసరాలకు అవి ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. ఒక బృందంగా ఏర్పడి సంఘం ఏర్పాటు చేసుకొని తక్కువ వడ్డీలకు అప్పులు తీసుకొని అభివృద్ధి చెందడానికి వీలుంటుందని అన్నారు. పొదుపు చేసుకొని ఉంటే ఆ సంఘం పది రెట్లు కలిపి రుణాలు మంజూరు చేస్తారని, రుణాలు తీసుకొని కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రైవేట్ ఫైనాన్స్‌లపై ఆధారపడకుండా అతి తక్కువ వడ్డీలకు సంఘాలలో అప్పులు తీసుకోవచ్చని పేర్కొన్నారు. పొదుపు సంఘాలలో రాష్ట్రంలోనే రాజేంద్రనగర్ పదో స్థానంలో ఉన్నారని తెలిపారు. వృద్ధాప్యంలో సంఘం ప్రతి నెల పింఛన్లు ఇస్తూ కుటుంబ పోషణకు తోడ్పడుతుందని చెప్పారు.
సమావేశంలో మాజీ కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎస్.వెంకటేష్ కురుమ, సానెం శ్రీనివాస్‌గౌడ్, అడికె అర్జున్, కాశిగారి యాదగిరి, పండరి, పున్న కృష్ణ, జనార్దన్, నరేష్, సురేష్, సంఘం ప్రతినిధులు కె.ఘనమ్మ, నామని మోహన్, ఎర్వ కుమారస్వామి, బి.బిక్షపతి, రాజు, సత్యనారాయణ, డి.రాజు, జి.లక్ష్మి పాల్గొన్నారు.