మెయన్ ఫీచర్

ఆక్రమిత కాశ్మీర్‌లో ఏం జరుగుతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజుమన్ మిన్‌హాజ్-యి-రసూల్ అనే ముస్లిం సంస్థ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో శాంతి, సామర్యం కోసం పనిచేస్తున్నది. ఆ సంస్థ చైర్మన్ వౌలాన సయ్యద్ అథర్ డెహ్లావి ఈమధ్య పత్రకారులతో మాట్లాడుతూ ‘ప్రజాభిప్రాయ సేకరణ’ జరిగితే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 99 శాతం ప్రజలు భారత్‌లో కలిసిపోయేందుకు ఇష్టపడతారన్నాడు. జమ్మూలో ఈమధ్య వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన ఆయన కాశ్మీరులో తీవ్రవాదులకు కాలం చెల్లిందని, ప్రజల సుపారిపాలన, అభివృద్ధి కోరుకుంటున్నారని అన్నారు. వరదల్లో సైనికులు చేసిన సేవల్ని ఆయన కొనియాడారు. సైన్యమే తమను నిజంగా కాపాడగలదని ప్రజలు భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. పనిలో పనిగా ప్రధాని మోదీ ప్రజాహిత కార్యక్రమాలను ఆయన మెచ్చుకున్నారు. ‘ఆల్‌ఖైదా’కు వ్యతిరేకంగా గళం విప్పిన ఏకైక ముస్లిం సంస్థ తమదేనన్నారు.
1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతం త్య్రం లభించింది. 1947 అక్టోబరు 22వ తేదీ అర్థరాత్రి పాకిస్తానీ కొండ జాతుల గుంపు మొట్టమొదటిగా తమ దేశపు సైన్యం అండతో పెద్దఎత్తున కాశ్మీర్‌లో ప్రవేశించింది. జీలం, కిషన్ గంగా నదులపై వున్న వంతెనలను, ముజఫరాబాద్ పట్టణాన్ని దురాక్రమణదారులు ఆక్రమించారు. కాశ్మీర్ మహారాజు భారత్‌లో విలీనాన్ని ప్రకటిస్తూ ఢిల్లీకి లేఖ వ్రాసిన అనంతరం అక్టోబర్ 27వ తేదీ భారత వైమానిక దళాలు కాశ్మీర్ చేరుకున్నాయి. భారత సైన్యం శత్రు సైన్యాలను తరిమికొట్టాయి. భారత సైన్యాలు విజయవంతంగా పురోగమిస్తూ జమ్మూ కాశ్మీర్‌ను విముక్తం చేసే సమయంలో ఆకస్మికంగా నాటి ప్రధాని నెహ్రూ జనవరి 1, 1949న యుద్ధ విరమణ ఆదేశమిచ్చాడు. అప్పటికే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మూడవ వంతు భూభాగం పాకిస్తాన్ వశమైంది. 35 వేల చదరపు మైళ్ళు వున్న ఈ భూభాగంలో విలువైన అడవులు, ఖనిజ సంపద వున్నది. బాల్టిస్టాన్, గిల్గిత్, మిర్‌పూర్-పూంచ్, ముజఫరాబాద్ జిల్లా లు పాకిస్తాన్‌లో కలిసిపోయాయి. పూంచ్ పట్టణం మినహా మిగిలినదంతా పాకిస్తాన్ అధీనంలో వున్నది. దీనికి పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్ అని పేరు పెట్టింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో యిక్కడినుంచి ప్రాతినిధ్యం లేదు. వ్యవసాయం, టూరిజంలే ఇక్కడి జీవనాధారం. ఇదొక స్వీయ పరిపాలన కలిగిన ప్రదేశం. ఎన్నోకోబడిన రాష్టప్రతి, ప్రధానమంత్రి, అసెంబ్లీ సభ్యులు, హైకోర్టు ఇక్కడ వున్నాయి. కాని వీరికి అజాద్ కాశ్మీర్ మీద పరిమిత అధికారాలున్నాయి. అంతా ఇస్లామాబాద్‌లోనే వుం టారు. అక్టోబర్ 24 వారు స్వతంత్రదినం జరుపుకుంటారు. మిగిలిన రెండు వంతుల భూభాగం భారత్ వశపరచుకున్నందున అక్టోబర్ 27ను బ్లాక్‌డేగా పాటిస్తారు. కాని నేడు పీవోకే (అజాద్ కాశ్మీర్)లో నిజంగానే చీకటి రోజులు దాపురించాయి. ప్రజలకు స్వేచ్ఛ లేదు. అందుకే ఇక్కడ ప్రజా ఉద్యమాలు ఊపందుకున్నాయి. దాంతో పాకిస్తాన్‌కు దడ పుట్టింది. సెప్టెంబర్ 7, 2004 నాడు వరద ముంపు ప్రాంతాలను సందర్శించేందుకు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వచ్చినపుడు ‘గో బ్యాక్’ నినాదాలు ప్రతిధ్వనించాయి. మోదీ నాడు పీవోకేలో సైతం సహాయ కార్యక్రమాల కోసం స్నేహ హస్తం అందించారు. దాంతో ఇక్కడి ప్రజలు ‘మోదీ’ వైపు ఆశలు పెంచుకున్నారు. దశాబ్దాల తరబడి వారిపై పాకిస్తాన్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతున్నది. అభివృద్ధికి వారు ఆమడ దూరంలో వున్నా రు. కేవలం తీవ్రవాద శిబిరాలను పెంచేందుకే పాకిస్తాన్ ఈ భూభాగాన్ని వాడుకుంటోంది. గత కొనే్నళ్లుగా పాకిస్తాన్‌లో చెలరేగుతున్న హింస, తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభం పీవోకేలో ప్రజానీకాన్ని కలవరపరుస్తున్నాయి. ‘స్వతంత్ర కాశ్మీర్’ కావాలన్న ఉద్యమాలు ఇక్కడ చాలా జరిగాయి. ఇదిలా వుంటే పివోకేలో చైనా కొన్ని నిర్మాణాలు చేపట్టి పూర్తిచేసింది. 7 మీటర్ల పొడవైన 5 సొరంగాలను కారంకోరమ్ హైవేమీద చైనా నిర్మించింది. ఇది పివోకేను చైనాను కలిపే రహదారి. 2014లో నవాజ్ షరీఫ్ వీటిని ప్రారంభించాడు. ఇవి పివొకెలోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో వున్నా యి. రెండు పెద్ద వంతెనలను, 78 చిన్న వంతెనలను కూడా చైనా నిర్మించింది. అట్టాబాద్ సరస్సు నీటిలో కొట్టుకుపోయిన 28 కిలోమీటర్ల రోడ్డును పునరుద్ధరించడంలో భాగంగా ఇది జరిగింది. దీనిపై భారత్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 29, 2014 నాడు పివోకేలో పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం జరిగింది. పాకిస్తాన్ సాయుధ సైన్యాలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ఉద్యమకారులు ఆందోళన వెలిబుచ్చారు. పాకిస్తాన్ నుంచి తమను వేరు చేయమని నినాదాలు చేశారు. భారత ప్రభుత్వం మరింత మానవత్వం కల్గిందని ప్రస్తుతించారు. 200 మంది నిరసకారులను ముజఫరాబాద్, గిల్గిత్, కోట్లీలనుంచి పాకిస్తాన్ ప్రభుత్వం నిర్బంధించింది. ప్రధాని నవాజ్ షరీఫ్, గిల్గిత్ బాల్టిస్తాన్‌ను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించి ఎన్నికలు నిర్వహించారు. దీనిపట్ల కూడా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 46 బిలియన్ డాలర్ల చైనా- పాకిస్తాన్ ఆర్థిక మండలికి తెరతీసేందుకు పవోకేతో రైల్వే లింకు లైను నిర్మాణం కూడా చైనా చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో పాకిస్తాన్ చేస్తున్న అత్యాచారాలు మొదటిసారిగా 2, 3 నెలల క్రితం సిఎన్‌ఎన్ ఐబిఎన్ ప్రసారం చేయడంతో పివోకే మొదటిసారిగా అంతర్జాతీయ మీడియాలో దర్శనమిచ్చింది. భారత్‌లో భాగమైన కాశ్మీరులో పౌరులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహకారమున్నది. జాతీయ ఆస్తు లు, ప్రాథమిక ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు వంటి సౌకర్యాలు కాశ్మీరీలకు అందుబాటులో వున్నాయి. అయినా అప్పుడపుడు కాశ్మీర్‌లో యువకులు ఆందోళన చేస్తుంటారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయడం కోసం తప్ప మరోటి కాదు. ఎన్ని రోజులు బంద్‌లు జరిగినా ఎవరికీ నష్టం లేదు. కావాల్సినంత ఆహార సామగ్రి, లగ్జరీ కార్లు, కాస్మొటిక్స్, యివన్నీ కాశ్మీరు ప్రజలు కల్గి వుంటారు. ప్రభుత్వ సొమ్ముతో అక్కడ వేర్పాటువాద నాయకులు బిఐసి (ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కంట్రీస్) సమావేశాల్లో పాల్గొంటుంటారు. ప్రధానిని, రాష్టప్రతిని కలవడానికి వారికి అపాయింట్‌మెంట్ అక్కరలేదు. అలాగని వారు భారత్‌ని విడిచివెళ్ళరు. పాకిస్తాన్‌తో కలవరు. ముస్లింలు తప్ప అక్కడ ఎవరూ ఉండటానికి వీల్లేదనేది వీరి అభిమతం. నాలుగు లక్షలమంది హిందువులను వెళ్ళగొట్టారు. తరువాత సిక్కులను కూడా వెళ్ళమని బ్లాక్‌మెయిల్ రాజకీయాలు నెరపారు. ఈ పరిస్థితిని మార్చేందుకే కాశ్మీరు అభివృద్ధి లక్ష్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీతో భాజపా అధికారం పంచుకుంది. కనుక భారతదేశపు ప్రజాస్వామిక, సెక్యులర్ ప్రభుత్వ నేతృత్వంలోనే కాశ్మీరుకు రక్షణ వుందన్నది సత్యం. వాజ్‌పేయి కాలంలో ప్రారంభించబడిన ఎన్నికల ప్రక్రియ నేటికీ సజావుగా సాగుతోంది. దేశ విభజన సమయంలో కాశ్మీరు విలీన సమయంలో షేక్ అబ్దుల్లా నెహ్రూను బెదిరించారు. పాకిస్తాన్‌తో కలుస్తామన్నాడు, నెహ్రూ సరే అన్నాడు. కాని షేక్ అబ్దుల్లాను పాకిస్తాన్‌లో ఎవరు పట్టించుకుంటారు? అందుకే భారత్‌లో విలీనానికి మొగ్గాడు. అందుకే కాశ్మీర్‌లో ఇవాళ మానవ హక్కులకు పూర్తి రక్షణ ఉన్నది. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. తరిమివేయబడ్డ హిందువులను కూడా పునరావాసం గురించి కాశ్మీరు బిజెపి-పిడిపి ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాని పీవోకేలో అరాచకం రాజ్యమేలుతోంది. పాకిస్తాన్ 1948లో అక్రమంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఖాళీ చేయమని యుఎన్‌వొలో మాట్లాడుతూ భారత విదేశాంగ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. నిజంగా 1953 ఆగస్టులో షేక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని నెహ్రూ డిస్మిస్ చేసి రాత్రికి రాత్రి నిర్బంధించిన తరువాత బక్షీ గులాం మహమ్మద్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హయాంలో ఫిబ్రవరి 6, 1956న జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ నిర్ణాయక సభ జమ్మూ కాశ్మీర్ విలీనం విషయమై చేసిన తీర్మానంలో, 1947 ఆగస్టు 15 నాడు కాశ్మీర్‌లో ఏ భూభాగాలున్నాయో అవన్నీ కాశ్మీరు విలీనంలో భాగమని చెప్పబడింది. 1994 ఫిబ్రవరి 22నాడు భారత పార్లమెంటులో, కాశ్మీరులో పీవోకేను విలీనం చేస్తామని తీర్మానించారు. కాబట్టి పీవోకే ఎప్పటికీ భారత్‌దే. పివొకెకు భారత ప్రభుత్వం మాత్రమే సుస్థిర శాశ్వత పరిష్కారం ఇవ్వగలదు. ఇటీవలి ప్రభుత్వాలేవీ పీవోకే విషయమై అంతర్జాతీయ వేదికలమీద లేవనెత్తలేదు. కాని మోదీ ప్రభుత్వం ఈ విషయమై దృఢవైఖరి నవలంభిస్తున్నది. అమెరికా నుంచి బిలియన్ డాలర్ల సహాయం వచ్చినా, రష్యా నుంచి మిగ్-35 హెలికాప్టర్లు ఎగిరి వచ్చినా, చైనా ఆర్థిక కారిడార్లకు సహాయపడినా భారత్ ఇచ్చే స్నేహహస్తం మరింత గొప్పదని పాకిస్తాన్ ప్రభుత్వం గుర్తించాలి. అందుకు పీవోకేను భారత్‌కప్పగించడం అవసరం. (చిత్రం) పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజల్లో 90 శాతం మంది భారత్‌లో విలీనానే్న కోరుకుంటున్నారు.

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్