25న పోకిరి రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవా, హన్సిక జంటగా రామ్‌ప్రకాష్ రాయప్ప దర్శకత్వంలో సాయిగీతా ఆర్ట్స్ పతాకంపై మలిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ, హనీప్రమోద్, శ్రీనులు నిర్మిస్తున్న చిత్రం ‘పోకిరి రాజా’. ‘్ఫన్ ఆఫ్ విండ్’ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుందన్నారు. ఈ సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాత తెలియజేస్తూ, తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నామని, ప్రముఖ నటుడు సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ విలన్‌గా నటిస్తున్నాడని అన్నారు. హన్సిక గ్లామర్, జీవా నటన సినిమాకు హైలెట్‌కానున్నాయని, భారీ పోటీ మధ్య ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్నామని, డి.ఇమాన్ సంగీతం అందించిన ఈ పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. తెలుగులో జీవాకు మంచి మార్కెట్ వుందని, తను నటించిన ‘రంగం’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడని అన్నారు. ఆ సినిమా తర్వాత జీవాకు మంచి గుర్తింపునిచ్చిన సినిమా ఇదన్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమాన్, నిర్మాతలు: ఎం.వీరవెంకట సత్యనారాయణ, హనీప్రమోద్, శ్రీను, దర్శకత్వం: రామ్‌ప్రకాష్ రాయప్ప.