జాతీయ వార్తలు

పోలవరంపై సుప్రీంలో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పోలవరంపై ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తీసుకున్న అనుమతులకు, చేపడుతున్న నిర్మాణాలకు పొంతన లేదని ఒడిశా వాదించింది. అనుమతులకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని ఏపీ వివరణ ఇచ్చింది. మూడు రోజుల్లో ఏపీ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 2కు వాయిదా వేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పునకు అనుగుణంగానే పోలవరం నిర్మాణం జరుగుతోందని సీడబ్ల్యూసీ అఫిడవిట్ దాఖలు చేసింది.