ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’ పూర్తి నాటికి గోదావరి జలాలు ఆవిరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 10: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినప్పటికీ నిధుల కేటాయింపు తీరు చూస్తుంటే ఆ ప్రాజెక్టును చూడగల్గుతామా యనిపిస్తోందని రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాజెక్టు డిజైన్‌లన్నింటినీ సమూలంగా మార్చివేసి అక్రమంగా 500 టిఎంసిల నీటిని తరలించుకోటాన్ని రూ.32వేల కోట్ల రూపాయలతో అంచనాలు వేయటం జరిగిందన్నారు. సిఎం చంద్రబాబు ఇవేమీ పట్టించుకోకుండా పట్టిసీమ ఎత్తిపోతలను పట్టుకొని ఊరూరా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. అసలు భవిష్యత్‌లో గోదావరిలో నీరు నిలువ వుంటే కదాయని అన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతో కలిసి ఆయన గురువారం నాడిక్కడ విలేఖరులతో మాట్లాడారు.ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నుంచి గోదావరిలోకి దిగువకు మూడోవంతు నీరు రావాల్సి వుంటే కెసిఆర్ రివర్స్ పంపింగ్ ఆధారంగా సాగునీరు తరలించుకుపోవడానికి ప్రయ త్నిస్తున్నారని పేర్కొన్నారు.