ఆంధ్రప్రదేశ్‌

పోలవరం వేగం పెరిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.3500 కోట్లు కేటాయింపుతో చిగురిస్తున్న ఆశలు

రాజమహేంద్రవరం, మార్చి 10: రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు రూ.3500 కోట్లు కేటాయించటంతో ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించిందన్న కారణంతో రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించకుండా, రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా రూ.3500 కోట్లు కేటాయించటం పట్ల ప్రజల్లో కాస్తంత సంతృప్తి వ్యక్తమవుతోంది. పోలవరం నిర్మాణం బాధ్యత విభజన చట్టం ప్రకారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అయినప్పటికీ, రాష్ట్ర విభజన జరగడానికి ముందు టెండర్లు ఖరారుచేసి, ప్రారంభించిన పనుల పర్యవేక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే కావటంతో, రాష్ట్ర బడ్జెట్‌లో పోలవరం పనులకు నిధులను కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.3500 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు సుమారు రూ.1060 కోట్లు కేటాయించినప్పటికీ, పట్టిసీమ ప్రాజెక్టు పుణ్యమా అని సుమారు రూ.2వేల కోట్లు వరకు రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసింది. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తయిందనిపించిన రాష్ట్రప్రభుత్వం, ఇక నుండి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనే దృష్టి కేంద్రీకరించింది. పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామో, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూడా అంతే శ్రద్ధ చూపించకపోతే, ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం పోలవరం నిర్మాణానికి భారీగానే నిధులను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో కేవలం రూ.100కోట్లు మాత్రమే కేటాయించినప్పటికీ, తరువాత మరికొన్ని నిధులు కేటాయిస్తామన్న భరోసా ఇవ్వటం, రాష్ట్ర ప్రభుత్వం భారీగానే నిధులను బడ్జెట్‌లో కేటాయించటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో పోలవరం పనులు వేగం పుంజుకుంటాయన్న ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తంచేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తం 11.48కోట్ల క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వకం పనులు జరగాల్సి ఉండగా, గత రెండు మూడు నెలలు క్రితం వరకు 5000 నుండి 10,000 క్యూబిక్ మీటర్ల మధ్యనే పని జరుగుతూ ఉండేది. ఇప్పుడా మట్టి పనులు గత కొద్ది కాలంగా వేగం పుంజుకుని, ప్రస్తుతం రోజుకు లక్ష 20వేల క్యూబిక్ మీటర్లు పని జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన మొత్తం పని సుమారు 2కోట్ల 68లక్షల క్యూబిక్ మీటర్లు. రాష్ట్రప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో పాటు, అదనంగా కూడా నిధులు కేటాయిస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మెరుగైన పురోగతిని చూసేందుకు అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రప్రభుత్వం కేటాయింపుల్లో చూపించినంత శ్రద్ధ, కేటాయించిన నిధులను ఖర్చుచేయటంలో చూపిస్తుందా? అన్నదే ఇరిగేషన్ నిపుణుల్లో ఉన్న అనుమానం.