ఆంధ్రప్రదేశ్‌

పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పేర్కొన్నారు. దుర్గా ఘాట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి డ్రోన్ల ద్వారా పోలవరం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పనులను ఇకపై ప్రతి నెల ప్రాజెక్టు పనులు పరిశీలిస్తానని, ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.1700 కోట్లు ఇవ్వాలన్నారు. వచ్చే నెలకల్లా పోలవరం ప్రాజెక్టు సైట్ వరకు ఫైబర్ గ్రిడ్, సర్వైలెన్స్, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి రోజు 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేయాల్సి ఉందని, డయాఫ్రాం వాల్ నిర్మాణానికి పనులు వేగవంతం చేశామని పేర్కొన్నారు. పోలవరం పనులకు వైసీపీ, కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుపడుతున్నాయని విమర్శించారు.