రాష్ట్రీయం

పోలీసుల పూర్తి సహకారం లేకుండా విధులు నిర్వర్తించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇసుక తవ్వకాలపై ఏపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్
కాకినాడ, నవంబర్ 30: రాష్ట్రంలోని వివిధ ఇసుక రీచ్‌లలో జరుగుతున్న మాఫియా అక్రమాలపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది విచారణకు వెళ్ళాల్సివస్తే అందుకు పోలీసుల సహాయాన్ని పూర్తిస్థాయిలో కల్పించాలని ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. పోలీసుల రక్షణ లేనిదే ఇసుక రీచ్‌ల జోలికి వెళ్ళేది లేదని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా విన్నవించినట్టు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో సోమవారం వెంకటేశ్వర్లు విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకోవడానికి వెళుతున్న తహసీల్దార్లు, ఇతర సిబ్బందిపై జరుగుతున్న దాడులను వెంకటేశ్వర్లు ఈసందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో సుమారు మూడు దశాబ్దాలుగా రెవెన్యూ శాఖ సిబ్బంది కొరతతో అల్లాడుతోందన్నారు. 1985లో మండలాల వ్యవస్థను ఏర్పాటుచేశారని, ఆ తర్వాత మండలాల విభజన జోలికి వెళ్ళలేదని పేర్కొన్నారు. మండలాల్లో జనం అనేక రెట్లు పెరిగినా మండల, డివిజన్ల సంఖ్యను పెంచకపోవడంతో పాటు ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచలేదన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది విపరీతమైన పనిభారంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇసుక, భూగర్భ గనులు, భూమి, సర్వే, వ్యవసాయం, అగ్రికల్చర్, పౌర సరఫరాలు తదితర పనులన్నీ ఒక్క రెవెన్యూ ఉద్యోగులే చూడాల్సి వస్తోందన్నారు. అన్ని రకాల ప్రభుత్వ శాఖలకు రెవెన్యూ శాఖ అత్యంత కీలకంగా మారిందన్నారు. వివిధ రకాల విద్యార్థుల పరీక్షల నుండి పోటీ పరీక్షల వరకు నిర్వహణ, ఓటరు జాబితాల నుండి పలు రకాల ఎన్నికల నిర్వహణ బాధ్యతలు కూడా రెవెన్యూ శాఖే చూడాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలోని ఒక్క సిసిఎల్‌ఎ శాఖ పరిధిలోనే 140 డిప్యూటీ తహశీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మరో 150 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీకి ప్రభుత్వం దృష్టి సారించలేదని వెంకటేశ్వర్లు విమర్శించారు. సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పితాని త్రినాథరావు, కెఎస్‌వి సుబ్బారావు పాల్గొన్నారు.