వరంగల్

పోలీసుస్టేషన్‌కు మారిన సీను...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*వార్తా కథనాలకు స్పందించిన అధికారులు
*బాధితురాలికి మహిళా పోలీసుల పిలుపు
*భర్త, అత్త, రెండో భార్యతో పాటు మరో నలుగురిపై కేసు
పాలకుర్తి, నవంబర్ 29: పంచాయతీకి రమ్మని ఆహ్వానపత్రాలు అందచేయడంతో స్పందించిన జిల్లా మహిళా పోలీసులు భర్త, అత్త, రెండో భార్యతో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బాధితురాలి తల్లిదండ్రులు పొన్నాల చంద్రవౌళి, సరస్వతి తెలిపిన వివరాల ప్రకారం... తన కూతురు సంధ్యను పాలకుర్తికి చెందిన బైరు భార్గవ్‌కు ఇచ్చి వివాహం జరిపించినట్లు తెలిపారు. వివాహ సమయంలో వరకట్నంతో పాటు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పారు. తన కూతురు సంధ్య యోగక్షేమాలు చూసుకోకుండా మరో యువతి ధరావత్ పద్మ ప్రేమలో పడి చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిపారు. దీంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించినా భార్గవ్ పెడచెవిన పెట్టాడని తెలిపారు. మహిళా పోలీసుస్టేషన్‌లో గత 10రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో పెద్దమనుషుల సమక్షంలో ఆదివారం పంచాయతీ నిర్వహించుకోమ్మని చెప్పగా తన కూతురు మనోవేదనతో యదార్థ సంఘటన పేరిట పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలకు పంచాయతీకి ఆహ్వానిస్తున్నట్లు పత్రికల్లో కథనాలు రావడంతో రావడంతో జిల్లా మహిళా పోలీసులు ఆదివారం పిలిపించినట్లు తెలిపారు. పోలీసుస్టేషన్‌లో తన కూతురు సంధ్య చేతుల మీదుగా రీఫిటిషన్ తీసుకొని మహిళా పోలీసుస్టేషన్ సిఐ ప్రభాకర్‌రావు నా అల్లుడు బైరు భార్గవ్, అతని తల్లి లలితాదేవి, రెండవ భార్య ధరావత్ పద్మతో పాటు వారి కుటుంబ సభ్యులు పిండిపోలు సోమలక్ష్మీ, రాపోలు అనురాధ, పెనుగొండ రమ, పిండిపోలు సత్యనారాయణలపై గృహహింస, అదనపు కట్నం, రెండో వివాహం చేసుకున్న నేరం కింద 498(ఎ), 494 ఐపిసి సెక్షన్ 34/బి/సి/4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. సిఐ ప్రభాకర్‌రావు చట్టపరంగా తన కూతురు సంధ్యకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకొని రిమాండ్‌కు తరలించనున్నట్లు సిఐ తెలిపినట్లు వివరించారు. దీంతో గత మూడు రోజులుగా బాధితురాలు ఆహ్వానపత్రాలపై పాలకుర్తిలో జోరుగా చర్చ జరుగుతుండడంతో నిందితులపై కేసు నమోదు చేయడంతో గ్రామస్థులు, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశారు.

దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న పాలకులు
నర్సంపేట, నవంబర్ 29: విదేశీ బహుళజాతి కంపెనీలకు, పెట్టుబడిదారి సామ్రాజ్య వాద దస్తశ్రాలకు దేశ ప్రయోజనాలను పాలకులు తాకట్టు పెడుతున్నారని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చంద్రన్న విమర్శించారు. పట్టణంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం లావుడ్యా రాజు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రన్న మాట్లాడుతూ డిసెంబర్ 15 నుండి 18 వరకు కెన్యా రాజధాని నైరోబిలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటివో) సమావేశాలు జరగబోతున్నాయని, ఈసమావేశాల్లో మన ప్రభుత్వ ప్రతినిధి బృందం కూడా పాల్గొని భారత ప్రభుత్వ రంగ సంస్థల్లోకి విదేశీ సామ్రాజ్య వాదుల పెట్టుబడులను ఆహ్వానిస్తూ కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దేశంలోని సమస్త రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసి చివరికి మూసివేసేందుకు ప్రభుత్వాలు చూస్తున్నాయని చెప్పరు. గతంలో జరిగిన డబ్ల్యూటివో ఒప్పందాలను దేశంలో అమలు చేయటం వల్ల దేశ వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిని వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని గుర్తు చేశారు.
నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు ఆదేశాలను, విషమ షరతులను దేశంలో అమలు చేసేందుకు పోటీ పడుతున్నాయని తెలిపారు. మన దేశం డబ్ల్యూటివో సమావేశాల్లో పాల్గొనవద్దని కోరారు. డబ్ల్యూటివో నుండి భారత దేశం బయటకు రావాలన్నారు. డబ్ల్యూటివో సమావేశాలకు వ్యతిరేఖంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో న్యూడెమోక్రసీ నేతలు ఎండి.యాకూబ్, చెన్నమళ్ల నర్సయ్య, అడ్డూరి చారి, గాలి శ్రీనివాస్, పైండ్ల యాకయ్య, బొక్కాల నర్సింహారావు, మూడు భద్రు తదితరులు పాల్గొన్నారు.