తెలంగాణ

పోలియా కార్యక్రమం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అంబర్‌పేట నాలాలో మురుగునీటిలో పోలియో వైరస్‌ టైప్‌ 2 వెలుగులోకి రావడంతో యుద్ధప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం పోలియో టీకాల కార్యక్రమాన్ని చేపట్టింది. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో పోలియో అత్యవసర టీకాల కార్యక్రమం సోమవారం నుంచి ఏర్పాటుచేసింది. రెండు జిల్లాల్లోనూ ఈనెల 26 వరకూ వారం రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. హైదరాబాద్‌లో 756, రంగారెడ్డి జిల్లాలో 116 పోలియో టీకా బూత్‌లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీనిని ప్రత్యక్ష్యంగా పర్యవేక్షించడానికి జెనీవా నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు డాక్టర్‌ జెన్నీఫర్‌ హాంటన్‌, డాక్టర్‌ హరీశ్‌ వర్మ, డాక్టర్‌ అభిజీత్‌ ఆనంద్‌ తదితరులు హైదరాబాద్‌లోనే మకాం వేశారు.