జాతీయ వార్తలు

పోలింగ్ ఏజెంట్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఓటర్ల చేత బలవంతంగా ఓట్లు వేయిస్తున్న పోలింగ్ ఏజెంటును హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఫరీదాబాద్‌లో ఓట్లు వేయిస్తున్న ఏజెంట్ వీడియో ట్విట్టర్‌లో వైరల్ కావటంతో పోలీసులు రంగంలోకి దిగి అతనిని అరెస్టు చేశారు. పోలింగ్ కేంద్రంలో బ్లూ టీ షర్టు వేసుకున్న ఓ వ్యక్తి మహిళా ఓటరు ఈవీఎం వద్దకు రాగానే వ్యక్తి లేచి ఓటింగ్ విభాగం వద్దకు వెళ్లి ఈవీఎం స్విచ్ నొక్కి వస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా పోలింగ్ కేంద్రంలో ఒక్క అధికారి కూడా అతడికి అడ్డుచెప్పకపోవడం గమనార్హం. జిల్లా ఎన్నికల అధికారులు సైతం ట్విట్టర్‌లో అతనిపై చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. ఓటింగ్‌లో ఎలాంటి తేడా జరుగలేదని వివరణ ఇవ్వటం జరిగింది.