జాతీయ వార్తలు

అయిదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అయిదు రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో సుమారు 17 కోట్ల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడు (234 సీట్లు), కేరళ (140 సీట్లు), పుదుచ్చేరి (30 సీట్లు) రాష్ట్రాల్లో ఒకే విడతలో మే 16న పోలింగ్ జరుగుతుంది. 126 స్థానాలున్న అస్సాంలో శాంతి భద్రతల దృష్ట్యా పోలింగ్ రెండు విడతల్లో ఏప్రిల్ 4, 11 తేదీల్లో జరుగుతుంది.
294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో మావోయిస్టుల సమస్య కారణంగా ఆరు విడతలుగా పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 4,17,21,25,30, మే 5న బెంగాల్‌లో పోలింగ్ నిర్వహిస్తారు. వివిధ తేదీల్లో పోలింగ్ జరిగాక, ఈ అయిదు రాష్ట్రాల్లోనూ మే 19న కౌంటింగ్ జరుగుతుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నజీమ్ జైదీ ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ, ఈ అయిదు రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. నామినేషన్లు వేసేందుకు చివరి తేదీకి ముందుగా కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో ‘నోటా’కు అవకాశం కల్పిస్తున్నారు. ఓటర్ల సౌకర్యార్థం ఇవిఎంలపై అభ్యర్థుల ఫొటోలు కూడా ఉంటాయి.