జాతీయ వార్తలు

పోలింగ్ స్టేషన్ వద్ద గాలిలోకి కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామ్‌రూప్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ సందర్భంగా కామ్‌రూప్ జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ వద్ద జనాన్ని చెదరగొట్టేందుకు ఓ జవాను గాలిలోకి కాల్పులు జరిపాడు. ఓటు వేసిన ఓ మహిళ తిరిగి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడాన్ని అక్కడే ఉన్న జవాను అడ్డుకున్నాడు. పోలింగ్ కేంద్రంలో ఉండిపోయిన బిడ్డను తెచ్చుకునేందుకు ఆమె వెళ్లగా జవాను ఘర్షణ పడ్డాడు. దీంతో స్థానికులు గుమికూడి జవానుతో వాదనకు దిగారు. ఈ పరిస్థితుల్లో గుంపును చెదరగొట్టేందుకు జవాను గాల్లోకి జరిపాడని జిల్లా ఎస్పీ తెలిపారు. కొంతసేపటికి అంతా సద్దుమణిగి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఆయన చెప్పారు.