డైలీ సీరియల్

పూలకుండీలు - 30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్కన మనుషుల అలికిడుంటే ఎందుకైనా మంచిదిలే దిగనీ’’ అనుకుంటూ అన్నం పొట్లం అందుకుంది.
సరిగ్గా అదే సమయంలో మరోసారి ఫోన్ మోగింది.
‘‘ఇంతలోకే ఎవరబ్బా’’ అనకుంటూ ఫోనెత్తింది శాంతమ్మ.
‘‘నేను వెంకటరెడ్డిని మాట్లాడుతున్నాను. నువ్వు లింగయ్యకు ఫోన్ జేసి లేనని చెప్పావంటగదా? వెంటనే వద్దామని నీకాన్నుండి నేనొక పనిమీద బైటికి బోతే తీరా బయటకొచ్చాక ఇక్కడ మా బామ్మర్ది కొడుక్కి యాక్సిడెంటై స్పాట్‌లో చచ్చిపోయాడు. దాంతో ఇక్కడే వుండిపోవాల్సొచ్చింది. అందుకే ఆ హడావిడిలో నీకు మళ్లా ఫోన్ చెయ్యడానిక్కూడా కుదరలేదు. మేమంతా ఇక్కడ గాంధీలో వున్నాం. ఇంకా పోస్ట్‌మార్టం కాలేదు. రేపొద్దునే్న చేస్తామంటున్నారు. అందుకే నేను రాలేకపోతున్నాను. నీ గురించిన అన్ని విషయాలూ అక్కడి పెద్ద డాక్టర్‌గారితో వివరంగా మాట్లాడాను. నేను లేకున్నా నీకేం తేడా రాకుంటా వాళ్ళు చూసుకుంటార్లే భయపడకు’’ అంటూ అటువైపు నుండి ఫోన్లోనే అన్ని వివరాలూ తెలియజేశాడు వెంకటరెడ్డి.
‘‘అయ్యో అట్లనా?’’ పొద్దున అతని ప్రతిచర్యనూ, ప్రతి మాటనూ అనుమానించిన శాంతమ్మ ఇప్పుడతని ఇబ్బందిని విన్న వెంటనే అదంతా మరిచిపోయి ఒక మనిషిగా తన సానుభూతిని వ్యక్తం చేసింది.
‘‘రేపు పొద్దున ఇక్కడ పోస్ట్‌మార్టం మొదలుపెట్టకముందే ఒకసారి అక్కడికొచ్చి కలవాల్సిన వాళ్ళను కల్సిపోతానే్ల జాగర్తగుండు’’ అంటూ ఫోన్ కట్ చేశాడు వెంకటరెడ్డి.
‘ఉట్టికట్టె ఇక్కడ, మనసంతా అక్కడ’ అన్నట్టు శాంతమ్మ మనసంతా పిల్లలమీదే కొట్టుకులాడుతుంటే అన్నం సహించకపోయినా బలవంతంగా నాలుగు ముద్దలు తిని ‘‘ఇక పడుకుందాం’’ అనుకుంటూ మంచంమీద ఒరిగింది. కానీ నిద్ర పట్టక అర్థరాత్రి దాకా ఒడ్డున పడ్డ చేప మాదిరిగా అటు కొట్టుకుని, ఇటు కొట్టుకుని తనకు తెలియకుండానే ఎప్పుడో తెల్లవారు జామున నిద్రలోకి జారిపోయింది.
11
పక్కగదిలోనుండి ఒక్కసారిగా ఏడుపులు విన్పించడంతో తుళ్లిపడి లేచిన శాంతమ్మ ‘‘పాపం! రాత్రి వచ్చిన ఆ పేషెంట్‌కి బాగోలేదేమో, ఒకసారి బయటకు పొయ్యి చూసొస్తే, ఆ ఎందుకొచ్చిన గొడవలే వాళ్ళెవరో నాకు తెలియదు. నేనెవరో వాళ్ళకు తెలియదు. అట్లాంటోళ్ళ దగ్గరికి ఏంబోతాం? ఒకవేల పొయ్యి చూసేటప్పుడు వాళ్ళల్లో ఎవరన్నా ‘మీదేవూరు? నీకేం జబ్బు?’ అని అడిగినే నేనేం సమాధానం చెప్పాలి? బైటికి బొయ్యి ఇబ్బందుల్లో పడేదానికన్నా ఆ నర్సులమ్మలొచ్చేసరికి మొకం కడుక్కుని, తానం జేసి రడీగుంటే మంచిది గదా!’’ అనుకుంటూ మంచంమీద నుండి లేచింది.
సరిగ్గా అదే సమయంలో భద్రాచలం నుండి వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు.
ఫోన్లో తండ్రి మాట వినబడంగానే కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరుగుతుంటే ‘్ఫన్ చిన్నోడికియ్యి’ అంది.
అట్లా నలుగురు పిల్లలతోనూ, తల్లితోనూ మాట్లాడేసరికి పక్కా పావు గంట పట్టింది.
ఆ తరువాత ముఖం కడుక్కుని, స్నానం చేసొచ్చి కూర్చునేసరికి మరో గంట ఇట్టే గడిచిపోయింది.
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.
‘ఎవరో?’ అనుకుంటూ వెళ్లి శాంతమ్మ తలుపు తీసింది. ఎదురుగా వెంకటరెడ్డి.
నిన్నటికి ఈ రోజుకి మధ్య గడిచిన కొన్ని గంటల వ్యవధిలోనే ఒక మనిషిలో అంత మార్పు వస్తుందంటే నమ్మలేనంతగా వెంకటరెడ్డి ముఖం పీక్కుపొయ్యి, నిద్ర లేక కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా మెరుస్తుంటే, గుడ్డలన్నీ నలిగిపొయ్యి రోడ్డుమీద తిరిగే బికారిలా కన్పించాడు.
ఆ తీరున వున్న అతణ్ణి చిత్రకన్నుపడి చూడసాగింది శాంతమ్మ.
వెంకటరెడ్డి కనీసం లోపలికి కూడా రాకుండా బైటనే నిలుచుని ‘‘నేను కింద కౌంటర్లో అన్ని వివరాలూ చెప్పి వచ్చాను. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అక్కడి పని అయిపోగానే నేనొస్తాను. లేదంటే రేపు పొద్దునే్న డాక్టర్లు రాకముందే ఎనిమిది గంటలకల్లా నీ ముందుంటాను సరేనా?’’ నేరుగా శాంతమ్మ కళ్ళలోకి చూస్తూ అన్నాడు.
అతని మాటలు విన్న శాంతమ్మ ‘‘నా ఖర్మేందోగాని ఏదైనా ఇంతే, నిన్న మొన్న నాతో పాటు ఇటు వస్తానన్న ఆ ఆర్‌ఎంపి లింగయ్య తీరా బయలుదేరి వచ్చేముందు ‘నేనర్జంటుగా పేషెంట్‌ను తీసుకొని ఖమ్మం పోవాల్సొచ్చింది. ఏదోవిధంగా నువ్వొక్కదానివి పొయ్యిరా, నేను అన్నీ మాట్లాడి వుంచాను’ అంటూ తప్పుకున్నాడు.
ఇక్కడికొచ్చాక ఈ వెంకటరెడ్డి ఎలాంటోడైనా రైలు స్టేషన్నించి నన్ను జాగర్తగా ఈడికి తీసుకొచ్చి వుంచి, కావాల్సిన ఏర్పాట్లు జేశాడు. తీరా ఇప్పుడు తను కూడా తోడు లేకుండా పోతున్నాడు. ఇదంతా నా సుడి కాకపోతే ఇంకేమనుకోవాల?’’ అనుకుంటూ తన్లో తను మదనపడసాగింది.
ఆవిడ సందేహమేంటో ఇట్టే గ్రహించిన వెంకటరెడ్డి ‘‘నీకేం ఫర్వాలేదు. మేం ఎవ్వరం వున్నా లేకపోయినా అన్నీ హాస్పిటల్ వాళ్లే చూసుకుంటారు. అసలు నిన్ను చేర్పించేంతవరకే మా బాధ్యత, ఆ తరువాత నీ బాధ్యంతా వాళ్ళే తీసుకుంటారు. నువ్వేం ఫికర్ పడకు’’ అంటూ ఇంకేదో చెప్పబోతుండగా అతని సెల్ మోగింది. వెంటనే సెల్ ఎత్తిన అతను ‘‘ఆ ఆ ఆల్రెడీ బయలుదేరాను మావా! ఇంకో అరగంటలో అక్కడుంటా’’ అంటూ ఫోన్ కట్ చేశాడు.
ఇంతలో పక్క రూమ్ వాళ్ళు ఖాళీ చేసిపోతున్నట్టుగా అలికిడి విన్పించడంతో ‘‘అయ్యో పాపం!’’ అనుకుంది శాంతమ్మ.
‘‘సరే పోస్ట్‌మార్టం చేసే డాక్టర్ వస్తున్నాడట.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు