డైలీ సీరియల్

పూలకుండీలు - 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇదుగోన్నా! నువ్వు చెప్పినట్టే ఇంటి కాయితాలు తెచ్చినం. వీటినా అనంతరావు కాడబెట్టి ఓ ముప్ఫై వేలు తెచ్చియ్యి’’ అంటూ ప్లాస్టిక్ సంచిలో మడతలు పెట్టి వుంచిన ఇంటి కాగితాలు బైటికి తీశారు.
‘‘తొండ ఎంతదూరం ఉరుకుద్ది? ముళ్ళకంచెలో పడ్డదాకే గదా! ఎన్ని రోజులైనా మీరు తిరిగి తిరిగి నా కాళ్ళ దగ్గరికి రావాల్సినోళ్ళేలే’’ శాంతమ్మ, ఎల్లయ్య దంపతుల గురించి అనుకుంటూ ఈ వారం రోజులుగా వాళ్ళ ప్రతి కదలికనూ గమనిస్తున్నాడు ఆర్‌ఎంపి లింగయ్య.
ఆ కోపంతో వాళ్ళను చూడ్డంతోనే ఒక్కసారిగా ఊగిపోతూ ‘‘ఏవమ్మా! ఏదో ఆడమనిషివని, అందునా నన్ను తోడబుట్టిన అన్నలెక్క భావించి చెప్పగూడని సంగతులు గూడా నోరు తెరిసి చెప్పినవని జాలిదలిచి నానా తిప్పలు బడి నేను డబ్బులు దెచ్చి ఇంట్లోబెడితే మీరేమో నా ఇంటి ముందు నుండి వస్తాపోతా గూడా నన్ను మందలించకుండా యాడాడో తిరిగి ఎక్కడా డబ్బులు పుట్టక మళ్లీ నా దగ్గరికొస్తారా! ఇదేనా పద్ధతి?
చూసీ చూసీ మీకిక అవసరం లేదేమోనని అనంతరావు దగ్గర తెచ్చిన డబ్బులు కాస్త నిన్ననే మున్సిపాలిటీలో పనిజేసే తాటి ముత్తవ్వకేదో అర్జంట్ పని పడిందంటే ఇచ్చేశాను’’ అంటూ అప్పటికప్పుడు ఓ అందమైన కట్టుకథ అల్లి చెప్పాడు.
‘‘అట్లంటే ఎట్లన్నా! పైసలు అవసరమున్నాయనేగదా నీ దగ్గరికొచ్చింది. కాకపోతే ఏడు రూపాయల వడ్డీ అనేసరికి భయమేసి నువ్వన్నట్లు తక్కువ వడ్డీకి ఇంకాడన్న దొరుకతయేమోని తిరిగిన మాట వాస్తవమే. మా వైపు నుంచి పొరపాటు జరిగిందని ఒప్పుకుంటున్నాం’’ ఇక అబద్ధం చెప్పినా లాభం లేదన్న ఉద్దేశ్యంతో ఉన్నదున్నట్లు చెప్పుకొచ్చింది శాంతమ్మ ఆర్‌ఎంపి లింగయ్య కళ్ళలోకి సూటిగా చూడలేక తలవంచుకొని నేల చూపులు చూస్తూ.
‘‘ఈ మాటలకేమొచ్చెలే ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, నేను గూడా వంద మాటలు చెబుతా కానీ లాభమేంది? డబ్బులుగాదు ముఖ్యం.
ఎదుటి మనిషి మీద నమ్మకం ముఖ్యం. నమ్మకం లేని చోట ఎంత చేసినా ఏం చెప్పినా ఏట్లో పిసికిన చింతపండే తప్ప లాభం వుండదు ఎరికేనా? మీ మాటలు నమ్మి నేను డబ్బులుదెచ్చి ఇంట్లో వుంచితే నాకాడికి రాకుండా నాటకాలాడారు. పైగా ఇప్పుడొచ్చి కల్లబొల్లి మాటలు విన్పిస్తున్నారు. మీ తెలివితేటలన్నీ చూపించడానికి నేనే దొరికానా!?’’ మాటలతోనే ఎదుటివాళ్ళ మనసులకు తూట్లు ఎలా పొడవొచ్చో శాంతమ్మ, ఎల్లయ్య దంపతులకు రుచి చూపిస్తూ వ్యంగ్యంగా మాట్లాడాడు ఆర్‌ఎంపి లింగయ్య.
అతనంత పరుషంగానూ, వ్యంగ్యంగానూ మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడాలో అర్థంగాక గోడకు కొట్టిన పిడకల్లా అలా వౌనంగా నిలుచుండిపోయారు శాంతమ్మ, ఎల్లయ్యలిద్దరూ.
ఇంతలో...
ఏదో బాధతో మెలికలు తిరిగిపోతున్న ఓ నడికారు ఆడమనిషిని మోసుకొని రైలు కట్ట అవతలి పక్కనుండి పదిమంది మనుషులొచ్చారు.
‘‘ఏమైంది?’’ అంటూ వచ్చిన వాళ్ళను అడిగాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘తేలుకుట్టింది’’ వచ్చిన పదిమందిలో అందరికన్నా పెద్ద వయసు ములాయన ఒకడు వణుకుతున్న స్వరంతో చెప్పాడు.
‘‘హ్హో అలాగా!’’ అంటూ ఇంట్లోకెళ్లి తన మెడికల్ కిట్ పట్టుకొచ్చిన ఆర్‌ఎంపి లింగయ్య వెంట వెంటనే ఆ ముసలమ్మ రెండు చేతులకూ రెండు యాంటీ వీనమ్ ఇంజెక్షన్లు ఇచ్చి ఆ పక్కనే వున్న బల్లమీద పడుకోబెట్టాడు.
ఇక అక్కన్నుండి ఓ గంటసేపు దాకా పేషెంట్‌తో వచ్చిన వాళ్ళంతా ఎప్పుడెప్పుడు, ఎవరెవరికి తేళ్ళు కుట్టాయో, వాళ్ళెంతెంత బాధపడ్డారో వైనవైనాలుగా వర్ణించి చెప్పుకుంటూ కూర్చున్నారు.
వాళ్ళుండగా తమ సంగతి తేల్చమంటూ అడగలేక తామూ వాళ్ళ ముచ్చట్లలో పాలు పంచుకుంటూ కూర్చున్నారు శాంతమ్మ, ఎల్లయ్యలు
ఆఖరికి గంట, గంటన్నర తరువాత పేషెంట్‌ను పంపించిన ఆర్‌ఎంపి లింగయ్య ‘‘ఆ ఇంగ మీ సంగతేందో చెప్పండీ!’’ అన్నట్టు శాంతమ్మ వాళ్ళ వంక చూశాడు నింపాదిగా తన మెడికల్ కిట్ సర్దుకుంటూ..
‘‘ఏముందన్నా! ఈ కాయితాలు తీసుకొని ఆ డబ్బులెయ్యో ఇస్తే మా దారిన మేం బోతం’’ అన్నట్టు అతని వంక చూశారు శాంతమ్మ ఎల్లయ్యవాళ్ళిద్దరూ.
‘‘డబ్బులు దొరకవని ఇందాకే చెప్పాను కదా’’ అంటూ లేచి బయటకు పోవడానికన్నట్లు బట్టలు వేసుకోసాగాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘లేదన్నా! నువ్ ఎక్కణ్ణన్న చూస్తానని మాటిస్తే తప్ప మేం ఈన్నించి కదలం’’ అంటూ మొండికేసినట్టుగా మాట్లాడింది శాంతమ్మ.
‘‘అరె చెబితే మీకు అర్థంకాదా! మీ కోసమని తెచ్చిన డబ్బులు వేరేవాళ్ళకిచ్చానని ఎంత చెప్పినా విన్పించుకోకుండా ఎందుకు నన్నిట్లా సతాయిస్తున్నారు?’’ తోటకూరలో పచ్చ పురుగును విదిలించినట్టు శాంతమ్మ వాళ్ళను విదిలించి వేస్తూ విసురుగా మాట్లాడారు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘ఇప్పుడు రోషానికి పోతే అసలుకే మోసం వస్తుంది. వీడితోటి మాటలుపడే రాతుంది పడుతున్నాం. వశం దప్పినపుడు వసుదేవుడంతటోడే గాడిదకాల్లు పట్టిండంట. మనమెంత? మన బిశానెంత? ఐనా ఇంటి కాయితాలు పెట్టుకొని వడ్డీకి పైసలిచ్చేదానికి కూడా వీడు మాకేదో పున్నానికిచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అందుకే అంటారు, పేదోడంటే కలిగినోనికెప్పుడూ కనికరముండదని’’ అనుకున్న శాంతమ్మ, ఎల్లయ్యలు వౌనం అతని వంకే చూస్తూ కూర్చున్నారు.
మరికొంతసేపు తన్లో తనే ఏదేదో గుణించుకున్న ఆర్‌ఎంపి లింగయ్య ఆఖరికి నోరు విప్పుతూ ‘‘ఇప్పుడు నేను పాల్వంచ రామ్మోహన్‌రావు డాక్టర్‌గారి హాస్పిటల్‌కి ఓ పేషెంట్ పనిమీద పోతున్నాం.
- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు