డైలీ సీరియల్

పూలకుండీలు - 20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాన్ని ఒక్కసారిగా చూసేసరికి వల్లు ఝల్లుమని భయంతో నిలబడిపోయిన’’ అప్పటికప్పుడు నోటికొచ్చిందేదో కల్పించి చెప్పింది.
ఇక అక్కణ్ణుండి శాంతమ్మ, ఖాశీంబీలిద్దరూ కల్సి బ్రతుకు వ్యధల గురించి తలపోసుకుంటూ బస్తీ దిక్కు వడివడిగా అడుగులు సారించారు.

8
శాంతమ్మ ఇల్లు చేరేసరికి ఉన్నదేదో తిన్న పిల్లలు ఎక్కడివాళ్ళక్కడ కుక్కకూనల్లా ముడుచుకుని పడుకున్నారు.
అత్తామామలిద్దరూ శాంతమ్మను చూడ్డంతోటే ‘‘ఏంది బిడ్డా! ఇంత చీకటైందేంది?’’ అంటూ ఆత్రుతగా పలుకరించారు.
‘‘ఏం లేదు, రేషన్ దుకాణంలో జనం పుల్లుగున్నారు. నా వంతొచ్చేసరికి ఈయాల్లయ్యింది. అక్కడికి చీకట్లబడి అదరాబాదరా వస్తనే వున్న’’ అంటూ అత్తమామలకు బదులిచ్చిన శాంతమ్మ స్నానం చేయడానికి తాటికమ్మల బాత్‌రూమ్‌లోకి వెళ్లి సిమెంట్ సంచుల పరదా వేసుకుంది.
‘‘కొడుకుబొయ్యి యాడనో కానని రాజ్జాన వున్నాడు. వాడక్కడ ఏందింటున్నాడో? ఏం వుంటున్నాడో? ఇన్ని రోజులైనా వాడెందుకిటు తిరిగి చూడలేదో? తెలవకపాయె. పరాయి తల్లి కన్నబిడ్డ ఈడ మనకోసం కన్నమ్మ కష్టాలు పడుకుంట మన కడుపున పుట్టిన బిడ్డకన్నా ఎక్కువ సూసుకుంటుంది. రోజూ ముప్పొద్దులా మన మొకాన ఇంత పిడస పడేస్తుంది. ఏ జన్మలోనో అది మనకు ఋణమున్నట్టుంది. ఆ బాకీ ఇప్పుడు తీర్చుకుంటుంది’’ కోడలు తమ కోసం, తమ మనవళ్ళు, మనవరాళ్ళ కోసం కష్టాలు పడుతుందన్న బాధతో తమలో తాము మాట్లాడుకోసాగారు.
వంటిమీద నాలుగు చెంబులు గుమ్మరించుకుని వచ్చిన శాంతమ్మ నాలుగు ముద్దులు తిని రోజు మాదిరిగానే పిల్లల మధ్య నడుము వాల్చి ‘‘మల్ల పొద్దునే్న లేచి ఇల్లు సగబెట్టుకొని కాలనీకి వురకాల’’ అనుకుంటూ కళ్ళు మూసుకుంది.
రోజు అలా పడుకోగానే ఇలా నిద్రపోయే శాంతమ్మకు ఆ రోజు వెంటనే నిద్రపట్టలేదు సరిగదా తను ఇంటికొస్తుంటే దారికాసి చెప్పిన ఆర్‌ఎంపి లింగయ్య మాటలు పదే పదే చెవుల్లో మారుమోగసాగాయి.
‘‘ఆ బాడఖావ్ ఆర్‌ఎంపి లింగడుగాడు మా లేమిని చూసేగదా ఏ మాత్రం భయం లేకుండా ముకంమీదనే ఇల్లు, పిల్లలను వదిలిపెట్టి హైదరాబాద్ బోయి సూదేయించుకొని, ఎవరికో పిల్లని గని ఇస్తే మూడు లక్షలిస్తారని చెప్పాడు. అసలు ఆడదాని పిల్లమడి అంటే ఏమనుకుంటున్నాడు వాడు? అదేమన్న ఎవరికిబడితే వాళ్ళకు కౌలుకిచ్చే దేవుడి మాన్యం అనుకుంటున్నాడా!?’’
‘‘ఆ అడిగితే అడిగాడులే. అతనడిగిదాంట్లో తప్పేముంది? ఇష్టమైతే ఒప్పుకో లేకుంటే లేదని ముందే చెప్పాడుగా. ఆయన జూస్తే ఎక్కన్నో బొంబాయిలో వుంటున్నాడాయె. ఈడ జూస్తే ముసలోల్లు, చిన్నపిల్లలు, వాళ్లల్లో ఒక గుండె జబ్బు పిల్ల. వీటికితోడు వంటినిండా ఏనుగుతామర మాదిరిగా ఊరినిండా అప్పులు. బాడవ నేలల్లో భూమి పుండ్లు పుట్టినట్టు మా బతుకుల్లో కనిపించని కష్టాల ఊబీలు లెక్కకు మించి మింగడానికి తయారుగున్నాయి. ఆ ఊబీలు దాటేదెన్నడో జనంలో కలిసేదెన్నడో? అది ఈ జన్మలో జరిగేదేనా?’’ అంటూ శాంతమ్మ మనసు అడ్డం తిరుగుతూ మాట్లాడింది.
ఇంతలో..
నడిపి పిల్లగాణ్ణి దోమలు కుట్టాయేమో లేచి కూర్చుని ఏడవసాగాడు.
ఆ ఏడుపును విన్న శాంతమ్మ ఆలోచనల్లోనుండి బయటపడి వెంటనే లేచి పిల్లవాడికి మంచినీళ్ళు తాపి బుజ్జగించి మళ్లీ నిద్రబుచ్చింది.
ఆ తరువాత మళ్లీ చాపమీద ఒరిగిన శాంతమ్మ ‘‘ఈ బస్తీలో నాలాంటి ఆడోల్లు ఎంతోమంది వుండగా ఆ ఆర్‌ఎంపి లింగయ్యకు ననే్న ఎందుకడగాలన్పించిందో?’’ అని తన్ను తానే ప్రశ్నించుకుంది.
‘‘ఏదో ఒకటి అన్పించి అడిగాడు. అడగ్గానే ఒప్పుకోవాలనేం లేదుగా. అతనన్నమాటలు వింటే ముందు ఎవరికైనా కోపం వస్తుంది. అట్లాగే నీకూ వచ్చింది. బ్రతుకులో ఇన్ని బాధలు పడేదానికన్నా అతను చెప్పినట్టు ఓ పది నెల్లు అటు బోయి కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నిన్ను కమ్ముకున్న కష్టాల కరిమబ్బులన్నీ నీకొచ్చే ఆ డబ్బులనే సుడిగాలికి ఎక్కడివక్కడ కొట్టుకుపోతాయి.
తప్పొప్పులనే ఎగుడు దిగుడు ఆలోచనలను కాసేపు పక్కనబెట్టి ఆలోచిస్తే మంచిది. డబ్బుల ముందు ఎట్లాంటి తప్పొప్పులైనా గడ్డిపోచల్లా కొట్టుకుపోతాయి. నువ్వేం భయపడకు’’ అంటూ మళ్ళోసారి పైకి లేచిన మనస్సు శాంతమ్మను తన వాదనతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
‘‘అమ్మో! అట్లాంటి పనిజేస్తే ఇయ్యలకాకున్నా రేపైనా నలుగురికీ ఏదో విధంగా తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళేమనుకుంటారు? అట్లా పరువు పోగొట్టుకొని సంపాదించే ఆ డబ్బులతో ఈ పాడు బతుకు బతికేకన్నా ఇంత విషం మింగి సచ్చిపోవడం మంచిది’’ పైట చెంగుతో పిల్లలమీద ముసురుతోన్న దోమలను విసురుకుంటూ అనుకుంది శాంతమ్మ.
‘‘ఓసి పిచ్చిదానా! చేతిలో డబ్బులుంటే చాలు మననేదో అంటారనుకుంటున్న ఆ నలుగురే మన కాళ్ళ దగ్గరికి నడిచొస్తారు. మనం చెప్పిందే నిజమని నమ్ముతారు. పదిమందిలో మనకు ఉచితంగా డప్పుకొడతారు.
మొన్నామధ్య ఈ బస్తీలోనే వుండే ఆ కటకం కస్తూరికి ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయావా? ఇందిరమ్మ డాబా ఇల్లు కోసం గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు పునాదులకు కూడా సరిపోక మధ్యలోనే ఇల్లు ఆగిపోవడంతో మీలాగే చెట్టు కింద వుండలేక అట్లాగని ఎక్కడా అప్పు పుట్టక ఆఖరికి ఆ మైక్రోఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకుని ఇల్లు కట్టింది. కానీ ఏం లాభం?
- ఇంకాఉంది

-శిరంశెట్టి కాంతారావు