ఆటాపోటీ

కార్ల పిచ్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ వెగాస్, అక్టోబర్ 28: ఓటమి ఎరుగని ప్రపంచ మేటి బాక్సర్ ఫ్లోయిడ్ మేవెదర్ జూనియర్‌కు బాక్సింగ్ మాత్రమేకాదు.. కార్లన్నా పిచ్చే. ఎప్పుడు మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చినా కొనేస్తాడు. తాజాగా 3.5 మిలియన్ డాలర్లు వెచ్చించి బగాటీ వేరన్ గ్రాండ్ స్పోర్ట విటెస్ కారును కొన్నాడు. ఈ మోడల్ కార్లు కేవలం 44 మాత్రమే ఉత్పత్తికాగా, వాటిలో ఒకదానిని మేవెదర్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ కారుకు చాలా ప్రత్యేకతలున్నాయి. గంటకు 254 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కేవలం 2.6 సెకన్ల సమయంలో సున్నా నుంచి గంటకు 62 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. బగాటీలో నాలుగు రకాల కార్లు ఇప్పుడు అతని వద్ద ఉన్నాయి. అతని గ్యారేజీ 39 అత్యాధునిక కార్లతో నిండిపోయింది. త్వరలోనే 3.2 మిలియన్ డాలర్ల విలువ చేసే పగానీ హుయారా కారును కొంటాడట. కోట్లకు కోట్ల రూపాయలను కార్లకే ఖర్చు పెడుతున్న మేవెదర్ క్రీడా ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకడు. అంత డబ్బు మూలుగుతున్నప్పుడు ఈమాత్రం పిచ్చి ఉండడం సహజమే!

ఉత్తమ జోడీ!
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, జో బర్న్స్‌ను మించిన ఉత్తమ జోడీ ఈకాలంలో లేదు. ఇటీవల బ్రిస్బేన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో వీరిద్దరూ మొదటి ఇన్నింగ్స్‌లో 161, రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు. 1938-39 సీజన్‌లో పాల్ గిబ్స్, ఎడ్డీ పేంటర్ మొదటి ఇన్నింగ్స్‌లో 184, రెండో ఇన్నింగ్స్‌లో 168 చొప్పున పరుగులు జోడించారు. ఆతర్వాత రెండు ఇన్నింగ్స్‌లోన 150కి పైగా పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను సాధించిన జోడీగా వార్నర్, బర్న్స్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కారు.

చెత్త బౌలింగ్
టెస్టుల్లో చెత్త బౌలింగ్ వీరుల జాబితాలో భారత పేసర్ ఇశాంత్ శర్మ కూడా చేరతాడు. శ్రీలంక టూర్‌కు వెళ్లినప్పుడు కొలంబోలో ఏంజెలో మాథ్యూస్ వికెట్‌ను పడగొట్టిన అతను టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని చేరాడు. అతను 65వ టెస్టులో ఈ ఫీట్‌ను అందుకోగా, అతని కంటే ఆలస్యంగా ఈ రెండు వందల వికెట్లు పడగొట్టిన ఇద్దరు బౌలర్లు ఆల్‌రౌండర్లే కావడం విశేషం. జాక్వెస్ కాలిస్ 102వ టెస్టు, ఆండ్రూ ఫ్లింటాఫ్ 69వ టెస్టులో ఈ ఘనతను సాధించారు. వారితో పోలిస్తే ఇశాంత్ పరిస్థితి మెరుగ్గా ఉందని ఎవరైనా అనుకోవచ్చు. కానీ, కాలిస్, ఫ్లింటాఫ్ బ్యాటింగ్‌లోనూ గొప్పగా రాణించారు. ఇశాంత్ బ్యాటింగ్ నైపుణ్యం ఏపాటిదో అందరికీ తెలుసు. పైగా ఒక్కో వికెట్‌కు అతు సగటున 36.51 పరుగులు సమర్పించుకున్నాడు. అందుకే చెత్త బౌలర్‌గా ముద్రపడ్డాడు.

లోస్కోరింగ్ మ్యాచ్‌లు
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొహాలీలో జరిగిన మొదటి టెస్టును లోస్కోరింగ్ మ్యాచ్‌ల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు, రెండేసి పర్యాయాలు ఆలౌటయ్యాయి. మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 694 పరుగులు మాత్రమే నమోదయ్యాయి. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ విధంగా తక్కువ లోస్కోరింగ్ టెస్టులు 24 ఉన్నాయి. వీటిలో అత్యల్ప స్కోరు 1888లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నమోదైంది. ఆ టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 116, రెండో ఇన్నింగ్స్‌లో 60, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 53, రెండో ఇన్నింగ్స్‌లో 62 చొప్పున మొత్తం 291 పరుగులు మాత్రమే చేశాయి. 40 వికెట్లు కూలాయి.

- సత్య