రాష్ట్రీయం

తేలిన ఉమ్మడి అప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాభా ప్రాతిపదికనే ఖరారు చేసిన కేంద్రం
తెలంగాణపై తగ్గిన భారం ఆంధ్రకు పెరిగిన రుణం

హైదరాబాద్, అక్టోబర్ 24: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల పంపకాలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. జనాభా ప్రాతిపదికన అప్పులను పంపిణీ చేసుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ సూచన ప్రకారం ఏపీకి 58.32 శాతం, తెలంగాణకు 41.68 శాతం అప్పులు పంపిణీ చేసుకోవల్సి ఉంటుంది. అప్పులపై జూలైలో ఏపీ ఆర్ధిక శాఖ రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రం విడిపోయే సమయంలో అప్పుడున్న ఆస్తులు, అప్పుల వాటాలపై కేంద్రం రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు చేసింది. రాష్ట్రం విడిపోవడానికి ముందున్న మొత్తం అప్పులు 1,48,060.22 కోట్లు. వడ్డీలు ఇతర లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే అప్పులు 1.78 లక్షల కోట్లు. గత బడ్జెట్ నాటికి కేంద్రం ప్రాథమికంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులను పంపిణీ చేసింది. పక్కాగా ఆడిట్ లెక్కలు ప్రకారం 1.48 లక్షల కోట్లమేర అప్పులు పంపిణీ సజావుగానే జరిగింది. మరో 30వేల కోట్ల రూపాయిల అప్పుల పంపిణీ ఇంతవరకూ జరగలేదు. ప్రస్తుతం వీటికి వడ్డీని ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తోంది.
అప్పుల వాటా తెలంగాణ రాష్ట్రానికి 61,711.50 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. దీనికితోడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఏటా అప్పులపై 5925 కోట్లు చెల్లించగా, అందులో తెలంగాణ వాటా 2500 కోట్ల రూపాయిల వరకూ భారం పడుతుంది. ఉద్యోగుల వేతన సవరణ, పెంచిన పెన్షన్లు, పథకాలకు అప్పులు అన్నీ కలిపి 80 వేల కోట్లు దాటుతోంది. కాగా ఆంధ్రలో అప్పులు లక్ష కోట్లు దాటాయి. విస్తీర్ణం పరంగా భూభాగం పరంగా ఆస్తులను పంచుకున్నపుడు అప్పులను సైతం అదేరీతిన పంచుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ వాదనను కేంద్రం తిరస్కరించింది. అదే జరిగితే ఆంధ్రకు అప్పులు శాతం తగ్గేదనేది అందరి వాదన. అప్పులకు ఒక ప్రామాణికత, ఆస్తులకు మరో ప్రామాణికత తీసుకోవడం వల్ల ఈసారి ఆంధ్రపై భారం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్ర జనాభా 8కోట్ల 41 లక్షలు. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల జనాభా 58.32 శాతం కాగా పది జిల్లాల తెలంగాణలో 41.68 శాతం జనాభా ఉన్నారు. మొత్తం అప్పులపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉన్నా కేవలం 30వేల కోట్ల అప్పులకు సంబంధించి మాత్రమే ఆంధ్ర, తెలంగాణల మధ్య పీటముడి పడింది. నాబార్డు, ప్రపంచబ్యాంకు, ఎడిబి నుండి వివిధ పథకాలకు విడుదలైన నిధులు, వౌలిక సదుపాయాలకు జైకా విడుదల చేసిన నిధులపై కొంత గందరగోళం వచ్చింది. వీటిలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఖర్చు చేశారు? ఎపీలో ఏయే జిల్లాలకు ఎంత కేటాయించారనే అంశంపై మల్లగుల్లాలు తొలగిపోలేదు. వాటన్నింటికీ తాజాగా కేంద్రం తెరదించింది.