విశాఖపట్నం

రవాణా వ్యవస్థల అనుసంధానం పటిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కృష్ణపట్నం పోర్టు డైరెక్టర్ శ్రీరామ్ రవిచంద్ర
విశాఖపట్నం, నవంబర్ 27: విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు సరకులను రవాణా చేసేందుకు రవాణా వ్యవస్థను మరింత పటిష్టవంతం చేయాల్సిన అవసరం ఉందని కృష్ణపట్నం పోర్టు డైరెక్టర్ కెప్టెన్ శ్రీరామ్ రవిచంద్ర అన్నారు. శుక్రవారం ఇక్కడ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ హొటల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి సంఘ అధ్యక్షుడు డి.వరదారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కెప్టెన్ రవచంద్ర మాట్లాడుతూ ఇండస్ట్రియల్ కారిడార్‌తోపాటు వివిధ ఉత్పత్తులతో కూడిన క్లస్టర్లను విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. దాంతోపాటు ఇక్కడ బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించే వీలుందన్నారు. కమర్షియల్ హబ్‌గా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వరదారెడ్డి మాట్లాడుతూ సమర్థవంతంగా రవిచంద్ర సేవలను అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎటిఎ ప్రతినిధులు సి.రాజగోపాల్ రెడ్డి, సి.జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.