రాష్ట్రీయం

391 పోస్టుల భర్తీకి పచ్చజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పథకం కింద భర్తీకి ఉత్తర్వులు
ఆయుష్ వైద్యులు, సిబ్బంది నియామకం

హైదరాబాద్, నవంబర్ 26: జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద తెలంగాణలో 391 మంది ఆయుష్ వైద్యులు, కాంపౌండర్లు, యోగ ఇన్‌స్ట్రక్టర్లు, స్వీపర్ పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఫేజ్-1, ఫేజ్-2 రెండు దశల్లో ఆయుర్వేద, హోమియోపతి, యునాని, సిద్ధ, నేచరోపతి, యోగ నాలుగు విభాగాలలో ఈ పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆయుష్ కమిషనర్‌కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టవ్య్రాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (పిహెచ్‌సి)లో ఆయుష్ వైద్యాన్ని అందుబాటులో తీసుకురావడానికి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భర్తీ చేయనున్న పోస్టులలో ఆయుర్వేద వైద్యాధికారులు 105, హోమియో వైద్యాధికారులు 50, యునాని వైద్యాధికారులు 21, నేచరోపతి వైద్యాధికారులు 8, కాంపౌండర్లు ఆయుర్వేదలో 64,హోమియో 46,యునాని 36, యోగ ఇన్‌స్ట్రక్టర్లు(సిద్ధ) 4, స్వీపర్లు 57 పోస్టులు ఉన్నాయి. ఇలా ఉండగా ప్రభుత్వం తాజాగా పోస్టుల భర్తీకి జారీ చేసిన ఉత్తర్వులలో ఫేజ్-1, ఫేజ్-2 కింద నియామకాలు జరుగనున్నట్టు పేర్కొనడం గందరగోళానికి దారితీసింది. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఫేజ్-1, ఫేజ్-2 కింద 2008, 2009లో పోస్టులు భర్తీ అయ్యాయి. అయినప్పటికీ మళ్లీ ఆ రెండు ఫేజ్‌లలోనే పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఉత్తర్వులలో పేర్కొనడంతో ఆయోమయంగా మారింది. ఆరు సంవత్సరాల నుంచి ఈ ఫేజ్‌ల కింద కాంట్రాక్టు విధానంలో వైద్యాధికారులు, కంపౌండర్లు, స్వీపర్లు పని చేస్తున్నప్పటికీ, వారు పని చేస్తున్న పోస్టులను ఖాళీలుగా చూపడం పట్ల ఆయుష్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెండు నెలలో రెగ్యులరైజ్ చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన 48 గంటలు గడవకముందే ఆయుష్ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించేలా ఉన్న ఈ ఉత్తర్వుల పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఫేజ్-1, ఫేజ్-2 పోస్టులు భర్తీ కావడంతో జారీ చేసిన ఉత్తర్వులు ఫేజ్-3, ఫేజ్-4 సంబంధించినా? లేక గతంలో నియామకం అయిన వారిని తొలగించబోతున్నారా? అనే దానిపై స్పష్టత లేదని వారు వాపోతున్నారు.