బిజినెస్

భారత పౌల్ట్రీ ఉత్పత్తులపై కువైట్‌లో నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: భారత్ నుంచి జరుగుతున్న పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై కువైట్ నిషేధం విధించింది. ఇటీవల దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోళ్లకు బర్డ్ఫ్లూ వైరస్ సోకిన ఘటనలే ఇందుకు కారణం. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న గుడ్లుపెట్టే కోళ్లు, మాంసపు కోళ్లు, పొదుగుడు గుడ్లపై ఇంతకుముందు విధించిన నిషేధాన్ని కువైట్ పిఎఎఎఫ్‌ఆర్ (పబ్లిక్ అథారిటీ ఆఫ్ అగ్రికల్చరల్ ఎఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్) గత అక్టోబర్‌లోనే తొలగించింది. అయితే ఇటీవల త్రిపురలో కోళ్లకు బర్డ్ఫ్లూ వైరస్ సోకిన ఉదంతం వెలుగులోకి రావడంతో భారత్ నుంచి పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై కువైట్ మళ్లీ నిషేధం విధించిందని ప్రభుత్వం అధికారిక నోటీసులో వెల్లడించింది. భారత పౌల్ట్రీ ఉత్పత్తులు ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలకే ఎగుమతి అవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో భారత్ నుంచి కువైట్ 1.20 లక్షల డాలర్ల విలువచేసే 24.2 టన్నుల పౌల్ట్రీ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. 2014-15 తొలి మూడు త్రైమాసికాల్లో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) మన దేశం నుంచి మొత్తం రూ.484 కోట్ల విలువైన పౌల్ట్రీ ఎగుమతులు జరగ్గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి రూ.584 కోట్లకు పెరిగాయి. అయితే ప్రస్తుతం కువైట్‌లో విధించిన నిషేధం వలన మున్ముందు మన దేశ పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆ రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.