రాష్ట్రీయం

నీటి కొరతతో విద్యుత్ ఉత్పత్తికి కష్టకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, డిసెంబర్ 28: ఎగువ జలాశయాల నుండి వరద నీరు రాకపోవటంతో నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు అడుగంటాయి. సాగునీటిని విడుదల చేయకపోవడంతో తెలంగాణలోని జన్‌కో నిర్వహణలో ఉన్న సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, ఆంధ్రాలోని సాగర్ కుడికాలువ జలవిద్యుత్ కేంద్రంపై తీవ్ర ప్రభావం పడింది. నీటి కొరతతో విద్యుత్ ఉత్పాదనకు కష్టకాలం వచ్చింది. సాగర్ ప్రాజెక్టు పరిధిలో ప్రధాన జలవిద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పాదనలో కీలకపాత్ర వహిస్తోంది. తొమ్మిది టర్బైన్లు ఉన్న ఈ కేంద్రంలో ఏటా సాగర్ రిజర్వాయర్‌లో నీరు సమృద్ధిగా ఉంటే విద్యుత్ ఉత్పాదన అధికంగా జరుగుతుంది. నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలోని జలవిద్యుత్ కేంద్రంలో మూడు టర్బైన్లు ఉన్నా, ఈ ఏడాది ఒక్క మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన కూడా జరగలేదు.