బిజినెస్

ఎన్‌డిఎస్‌ఎల్ కోజెన్ పవర్ ప్లాంట్ తరలింపునకు సన్నాహాలు...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకోవచ్చనే
సంకేతాలతో డెల్టా యాజమాన్యం ముందుజాగ్రత్త

బోధన్, డిసెంబర్ 6: తెలంగాణలో ఉన్నటువంటి నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డిఎస్‌ఎల్) కర్మాగారాలు, ఇతర ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వం ఉన్నత స్థాయిలో కసరత్తులు మొదలు పెడుతుండటంతో డెల్టా యాజమాన్యం గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా కర్మాగారాల అభివృద్ధి కోసం పెట్టిన పెట్టుబడులపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. కర్మాగారాలను గనుక తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకుంటే, వాటిపై బ్యాంకుల ద్వారా తెచ్చిన అప్పులు తీర్చే మార్గాన్ని అనే్వషిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం నిజాం డెక్కన్ షుగర్స్ ఫైనాన్షియల్ చీఫ్ ఆఫీసర్ చారి ఓ ప్రముఖ బ్యాంకు అధికారులతో కలిసి ప్రస్తుతం బోధన్ చక్కెర కర్మాగారానికి వచ్చిన సంగతి తెల్సిందే. ఇక్కడ డెల్టా యాజమాన్యం ఏర్పాటు చేసిన 20 మెగావాట్ల విద్యుత్ కోజెన్ పవర్ ప్లాంట్ కోసం బ్యాంకుల నుండి దాదాపు 100 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారని రికార్డులు తెలుపుతున్నాయి. ఈ బ్యాంకు రుణానికి డెక్కన్ షుగర్స్ యజమానికి ఆంధ్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఒకటి, రెండు సంస్థలను గ్యారంటీగా పెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజాం షుగర్స్ సంస్థలను స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ తెరపైకి రావడం, స్థానికంగా ఉద్యమాలు ఉద్ధృతమవుతుండటంతో ప్రభుత్వం ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. అందువల్లనే డెక్కన్ షుగర్స్ యాజమాన్యం ఇక్కడి వంద కోట్ల రూపాయల విలువ గల పవర్ ప్లాంట్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు పవర్ ప్లాంట్ కోసం భారీగా రుణాలు ఇచ్చిన బ్యాంకు అధికారులు కూడా అప్రమత్తమై ఇక్కడి పవర్ ప్లాంట్ పరిస్థితిని చూసి విలువను అంచనా వేసేందుకు ఇక్కడికి వచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం గనుక నిజాం షుగర్స్ సంస్థలను స్వాధీనం చేసుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నా బ్యాంకు అధికారులకు ఇచ్చిన గ్యారంటీ ఆధారంగా ఇక్కడి కోజెన్ ప్లాంట్‌ను తరలించుకుపోయేందుకు ఎటువంటి అడ్డంకులు ఉండవన్న ఉద్దేశంతో యాజమాన్యం ముందస్తు ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోధన్‌లోని కోజెన్ ప్లాంట్‌కు ఆంధ్రా ప్రాంతంలోని సంస్థలు గ్యారంటీగా ఉండటం వలన దీనిని తమకు అనుకూలంగా ఉండే ప్రాంతానికి తరలించుకు పోయేందుకు యాజమాన్యం ఆలోచించే అవకాశాలు లేకపోలేవు. వంద కోట్ల పెట్టుబడితో కూడుకున్న ఈ ప్లాంట్‌ను తరలించేందుకు ఐదా రు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చవుతాయని ఇంజనీర్ల అంచనా.