రాష్ట్రీయం

హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ. 1920 కోట్లతో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం
తెలంగాణ మంత్రులు కెటిఆర్, తలసాని వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 4: హైదరాబాద్ నగరంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా తగు ఏర్పాట్లు చేసినట్టు మంత్రులు తెలంగాణ మంత్రులు కె తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా 1920 కోట్ల రూపాయల వ్యయంతో సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో చర్చలు తీసుకుంటోందని, దీనిలో భాగంగా రాజధాని నగరంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్‌లో రెండువేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండేదని, కానీ ఏనాడూ డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ సరఫరా జరిగేది కాదని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్తగా వచ్చిన పరిశ్రమలు, పెరిగిన జనాభా ఇతర కారణాల వల్ల డిమాండ్ పెరిగిందని, ఇప్పుడు హైదరాబాద్ నగరానికి ప్రతి రోజు 2400 నుంచి 2800 మెగావాట్ల వరకు విద్యుత్ డిమాండ్ ఉందని తెలిపారు. డిమాండ్ పెరిగినా అవసరం అయినంత విద్యుత్‌ను అందించగలుగుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన ఆరునెలల కాలంలోనే కోతలు లేని విద్యుత్ అందించగలిగినట్టు చెప్పారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం మరింత పెరుగుతుందని, అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు వస్తున్నాయని తెలిపారు.
మంచి నీటి సరఫరా పథకాలు అమలు కావాలని, సిసి కెమెరాల వినియోగం లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంకా బాగా ఉపయోగించుకోబోతున్నామని, మెట్రో రైల్‌కూ విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లో మెరుగైన విద్యుత్ నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్ చుట్టూ రింగ్ ఫార్మ్‌లో విద్యుత్ లైన్ ఉందని చెప్పారు. రామగుండం, శ్రీశైలం, కొత్తగూడెం, భూపాలపల్లి నుంచి నేరుగు హైదరాబాద్‌కు విద్యుత్ అందుతుందని తెలిపారు. ఏదైనా కారణం వల్ల ఒక స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోతే మరో స్టేషన్ నుంచి విద్యుత్ అందించే విధంగా ఏర్పాట్లు జరిగాయని, దీని వల్ల హైదరాబాద్‌లో ఎప్పుడూ కొత విధించాల్సిన అవసరం లేకుండా చేసినట్టు చెప్పారు. నిరంతర విద్యుత్ కోసం హైదరాబాద్‌లో మియాపూర్, బొంగులూరు, నాగోలు, ఎర్రగడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ, ఫ్యాబ్‌సిటీ, వద్ద 893కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా ఏడు 220కెవి సబ్ స్టేషన్లు నిర్మించినట్టు చెప్పారు.
2016 మార్చి నాటికి నాలుగు నెలల్లో ఫీవర్ ఆస్పత్రి, ముసారాంబాగ్, పాటిగడ్డ, నిమ్స్, హయత్‌నగర్, రాయదుర్గం, మైలాపూర్, నారాయణగూడలో 692. 63 కోట్ల రూపాయల వ్యయంతో ఎనిమిది కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం చేయనున్నట్టు చెప్పారు. దొమ్మర పోచంపల్లి, ఖైతలాపూర్, ఇబ్రహీంబాగ్, వౌలాలి, సీతారాంబాగ్, ఆర్‌పి నిలయం, వాయుపురి, చంచల్ గూడ, పెట్లబుర్జ్ వద్ద 334 .51 కోట్లతో 9 కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తరువాత హైదరాబాద్‌కు నిరంతర విద్యుత్ అందించేందుకు 78 కిలో మీటర్ల 400 కెవి లైన్ల నిర్మాణం కోసం 88 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు చెప్పారు. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం కోసం 1920 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నట్టు చెప్పారు.