ప్రకాశం

అంతటా క్రికెట్ ఫీవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 18: జిల్లా అంతటా భారత్, పాకిస్థాన్ క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఆదివారం సాయంత్రం మూడుగంటలనుండే క్రికెట్ అభిమానులు టివిలకు అతుక్కుపోయారు. భారత్ పాకిస్తాన్‌పై గెలవాలంటూ క్రికెట్ అభిమానులు జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సెలవుదినం కావటంతో క్రికెట్ అభిమానులతోపాటు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, ఉద్యోగులు మ్యాచ్‌చూసేందుకు ఆశక్తి చూపారు. ఏనోట విన్నా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ మాటే వినిపిస్తోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్‌ను భారత ఎంచుకోవటంతో తమగెలుపుఖాయమన్న ధీమాలో జిల్లాలోని క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉండగా జిల్లావ్యాప్తంగా క్రికెట్‌అభిమానులు కొంతమంది భారత్ గెలుస్తుందని బెట్టింగ్‌లు కాసినట్లు తెలుస్తొంది. జిల్లావ్యాప్తంగా ఏవరి స్తోమతో వారు బెట్టింగ్‌లకు పాల్పడ్డారు. క్రికెట్‌బెట్టింగ్‌లో కోట్లరూపాయల్లో జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రికెట్ పోటీల సందర్బంగా వివిధ దేశాలు ఆడినప్పుడు సైతం జిల్లాలోని పలుప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగులు జరగటం సర్వసాధారణం. కాని దాయదుల పోరుకి సంబంధించి మాత్రం క్రికెట్ బెట్టింగ్‌లు భారీ మొత్తంలో ఉండనున్నాయి. గత కొన్నిరోజులనుండే జిల్లావ్యాప్తంగా భారీగా బెట్టింగ్‌లు జరిగినట్లు సమాచారం. జిల్లాపోలీసుయంత్రాంగం క్రికెట్ బెట్టింగ్‌లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికి బెట్టింగ్ రాయుళ్లు మాత్రం తగ్గటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పెద్దస్థాయిలో బెట్టింగ్‌రాయుళ్లను పోలీసులు అరెస్టుచేసినా రాజకీయనాయకుల నుండి ఒత్తిళ్లు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.మొత్తంమీద జిల్లావ్యాప్తంగా క్రికెట్ అభిమానులు క్రికెట్ ఫీవర్‌లో మునిగిపోయారు.