ప్రకాశం

రానున్న 30 ఏళ్ల పాటు జగన్ పాలనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 20: రాబోయే కాలంలో 30 సంవత్సరాలపాటు జగన్ పాలన రాష్ట్రంలో రానున్నట్లు వైకాపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగర శాసనసభ్యురాలు ఆర్‌కె రోజా జోస్యం చెప్పారు. వైకాపా జిల్లా ప్లీనరీ సమావేశం మంగళవారం స్థానిక సీతారామ ఫంక్షన్‌హాలులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ ప్లీనరీకి ముఖ్యఅతిథిగా హాజరైన రోజా మట్లాడుతూ జన హృదయనేత జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. దివంగత రాష్టమ్రుఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపాలనను జగన్‌ద్వారా చూడాలని ప్రజలు ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్‌పాలనలో సువర్ణాంధ్రప్రదేశ్ చూడబోతున్నట్లు ఆయన తెలిపారు. బాహుబలి సినిమా ఎంత విజయవంతమైందో అందరి చూశామని బాహుబలినిచూసి బల్లాలనాయుడు ఏలా భయపడతాడో అదేవిధంగా జగన్ అనే బాహుబలిని చూసి చంద్రబాబు గుండెల్లో వణుకుపుడుతుందని ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్దిచెందుతుందని రైతులు, అన్నివర్గాల ప్రజలు పరిష్కారం అవుతాయని అన్నారు. చంద్రబాబుపాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని, ఎన్నికల సమయంలో ఆరువందలహామీలు ఇచ్చి ఏఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. మూడుసంవత్సరాల చంద్రబాబుపాలనలో ప్రజలు మోసపోయారని ఆరోపించారు. ఇదేమంటే క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు ఓట్లువేసి గెలిపించి చంద్రబాబుకు దిమ్మదిరిగేలా చూడాలని తెలిపారు. ఒంగోలు గిత్తల సత్తా చూపించాలన్నారు. చంద్రబాబునాయుడు, సోనియాగాంధీలు జగన్‌పై ఎన్ని కేసులు పెట్టినా ఎదురొడ్డి ధైర్యంగా నిలిచిన ధైర్యవంతుడు జగన్ అని కొనియాడారు. అభివృద్ధి నిరోధానికి బ్రాండ్‌గా చంద్రబాబునాయుడు నిలుస్తారని ఆయన ధ్వజమెత్తారు. ఈ ప్లీనరీలో వైసిపి రాష్ట్రఅధికారప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒంగోలులో జరుగుతున్న జిల్లా ప్లీనరీలో వైసిపి కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే జిల్లాలోని 12అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపి స్థానాలు గెలుపొందటం ఖాయమనిపిస్తుందన్నారు. చంద్రబాబు బెంజి సర్కిల్‌పెట్టిన నవనిర్మాణ దీక్షలో కూర్చీలు ఖాళీగా కనిపించాయని అయితే ఒంగోలులో జరిపిన వైసిపి జిల్లా ప్లీనరీ సమావేశానికి జనం కుప్పలు తెప్పలుగా రావటం చూస్తే చంద్రబాబుకు దిమ్మతిరుగుతుందన్నారు. చంద్రబాబు మూడుసంవత్సరాలపాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చలేదని విమర్శించారు.రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పేమాటలు మోసపుమాటలని ప్రజలు ఎప్పుడో అర్ధంచేసుకున్నారని విమర్శించారు.బాబుదగ్గర బస్తాల డబ్బులు ఉన్నాయని వచ్చే ఎన్నికల్లో బస్తాల డబ్బులు పంచితే తీసుకుని ఓటర్లు వైసిపికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబువస్తుందని హామీ ఇచ్చారని కాని నిరుద్యోగ యువతకు జాబురాలేదుకాని ఆయన కుమారుడు లోకేష్‌కు మాత్రం మంత్రిపదవీ జాబు ఇచ్చారని ధ్వజమెత్తారు. నెల్లూరు పార్లమెంటుసభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు మాయజాలం కలిగిన వ్యక్తి అని రాబోయే ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి వైసిపికి ఓట్లువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలోని వెలుగొండ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలోని పులిచింతలలాంటి ఎన్నో ప్రాజెక్టులు వేగవంతంగా పనులు జరిగాయని అదేవిధంగా వైఎస్ బతికి ఉంటేపోలవరం ప్రాజెక్టుకూడా ఇప్పటికే పూర్తిఅయి ఉండేదని అన్నారు. చంద్రబాబుపాలనలో రాష్ట్రంలోని అన్నిప్రాజెక్టుల నిర్మాణాలు కుంటినడకన నడుస్తున్నాయని ఆయన విమర్శించారు. వైఎస్ పాలనలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలుచేసి అన్నివర్గాల ప్రజలకు మేలు చేశారని అదే చంద్రబాబు పాలనలో సంక్షేమపధకాలు సక్రమంగా అమలుజరగటం లేదని విమర్శించారు.రాష్టవ్రిభజనకు చంద్రబాబే కారణమని ఆయన ధ్వజమెత్తారు. ఈప్లీనరీలో మాజీ మంత్రి పార్ధసారధి, ఒంగోలు పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి, వైకాపా రాష్టస్రలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, వైకాపా జిల్లాపరిశీలకులు గోవిందరెడ్డితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఎపిజిబి ఆవులమంద శాఖ మేనేజర్ సస్పెన్షన్
కురిచేడు, జూన్ 20: కురిచేడు మండలం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆవులమంద శాఖలో గతంలో మేనేజర్‌గా పనిచేసి బదిలీపై కర్నూలు జిల్లాకు వెళ్లిన దేవరకొండ శ్రీనివాసులు సస్పెండ్‌కు గురయ్యారు. ఎపిజిబి నంద్యాల రీజియన్ మేనేజర్ ఈనెల 9న కురిచేడు శాఖను తనిఖీ చేశారు. ఆ సందర్భంగా గతంలో కురిచేడు శాఖ మేనేజర్‌గా పనిచేసి బదిలీపై పుల్లలచెరువుకు వెళ్లిన గౌతమ్ పద్మనాభరాజును సస్పెండ్ చేసినట్టు ప్రకటించిన విషయం పాఠకులకు విధితమే. అదే సందర్భంగా ఆవులమంద శాఖ మేనేజర్‌గా పనిచేసి కర్నూలు జిల్లాకు బదిలీపై వెళ్లిన శ్రీనివాసరావుపై కూడా శాఖాపరమైన విచారణ జరుగుతుందని తెలిపారు. విచారణలో రుణాల మంజూరులో అవకతవకలు, ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాల నుండి నగదు విత్‌డ్రా చేయడం తదితర అంశాలు వెలుగులోకి రావడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు కురిచేడులోని ఎపిజిబి శాఖకు సమాచారం అందింది. ఒకే బ్యాంకుకు చెందిన కురిచేడు, ఆవులమంద శాఖల మేనేజర్లు సస్పెన్షన్‌కు గురికావడంతో ఖాతాదారులు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు.