ప్రకాశం

పోలీసుల అదుపులో గుప్తనిధుల తవ్వకాల ముఠా. ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొనకొండ, అక్టోబర్ 15: పూర్వం కొచ్చర్లకోటను పరిపాలించిన రాజుల కాలంలో బందిపోటు దొంగల ముఠాలకు, యుద్ధాలకు భయపడి దొనకొండ మండలం అనంతవరం గ్రామ సమీపంలోని అనంతకొండలో భారీగా బంగారం, వజ్రాలు దాచారని శిలాశాసనాల్లో గమనించిన సిద్ధాంతులు గుప్తనిధుల ముఠాలకు ఈ సమాచారం తెలియచేయడంతో ఆ సమాచారం దగ్గర పెట్టుకొని హైదరబాద్, డోన్, కర్నూల్, విజయవాడకు చెందిన కొన్ని గుప్తనిధుల తవ్వకాల ముఠాలు ఈ కొండపై కనే్నసాయి. గత కొంతకాలంగా రహస్యంగా ఈ కొండను శోధించి తవ్వకాలు ప్రారంభించాయి. ఈ తవ్వకాల్లో భాగంగా పొక్లయినర్లతో కొంత తవ్వించిన తరువాత కూలీలతో పనులు జరగాల్సి ఉండగా కొచ్చర్లకోట గ్రామానికి చెందిన కొందరు కూలీలను, మార్కాపురం మండలం ఇడుపూరు గ్రామానికి చెందిన కొందరు కూలీలను వినియోగిస్తున్నారు. ఈ సమాచారం పసిగట్టిన మార్కాపురం పోలీసులు దొనకొండ పోలీసులను అప్రమత్తం చేసి శనివారం నిఘా వేయడంతో కొందరు కూలీలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటన ప్రదేశాన్ని మార్కాపురం పోలీసు ఉన్నతాధికారులు, దొనకొండ పోలీసులు గోప్యంగా ఉంచి అసలు రహస్యం రాబట్టేందుకు విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈవిషయంపై పోలీసులను వివరణ కోరగా వారు నోరు మెదపడం లేదు. సమాజంలో సామాజిక రుగ్మతలు తొలగించేందుకు
రచనలు ఎంతో ఉపయోగం
- మంత్రి శిద్దా వెల్లడి

ఒంగోలు,అక్టోబర్ 15:సమాజంలో సామాజిక రుగ్మతలను తొలగించేందుకు రచనలు ఎంతో ఉపయోగపడతాయని అందుకు రచయిత్రులు విశేషకృషి చేయాలని రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావుతెలిపారు. ఆదివారం స్ధానిక ఎన్‌టిఆర్ కళాక్షేత్రంలోనవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం తొలి రాష్ట్ర స్థాయి సాహిత్య సదస్సు కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్టస్థ్రాయి సాహిత్య సదస్సు ఒంగోలులో నిర్వహించటం అభినందనీయమన్నారు. సమాజంలో ప్రజలు ఏలా మెలగాలి అనే విషయంలో కవితలు,రచనలు, పుస్తకాలు ఎంతో అవసరమని మంత్రి తెలిపారు. నేటి రచయిత్రులు ప్రతిభాపాటవాలకు అనుగుణంగా రచనలు,పుస్తకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని, పుస్తకాల ద్వారా ప్రజల జీవితాలు మారే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రచయిత్రులకు మంచి ప్రొత్సాహం అవసరమని అందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. యువతలో మంచి ప్రజ్ఞాపాటవాలు ఉన్నాయని, సాహిత్యంతో మంచి ప్రవేశం ఉన్నవారు ఉన్నారని, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మంచి రచనలు భావి జీవితానికి మంచిపునాదులు వేస్తాయని మంత్రి తెలిపారు. నవ్యాంధ్ర రాష్ట్ర కవయిత్రుల సంఘానికి అవసరమైన సహాయసహకారాలు రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్ళి అందించే ఏర్పాటుచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తనవంతుగా రచయిత్రుల సంఘానికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో సింహద్రిజ్యోతిర్మయి రచించిన నవాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘంకు సంబంధించిన జాతీయగీతాన్ని, ఐఆర్ స్రవంతిరాసిన మనోరంజితాలు అనే పుస్తకాన్ని మంత్రి శిద్దా ఆవిష్కరించారు. ఈకార్యక్రమానికి నవాంధ్ర రచయిత్రుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు టి అరుణ అధ్యక్షత వహించారు. రాష్ట్ర స్ధాయి సాహిత్యసదస్సులో సంఘం ప్రధానకార్యదర్శి పి అన్నపూర్ణ, అధ్యక్షురాలు కళావతి చిన్నలక్ష్మి, ఉపాధ్యక్షురాలు ఐఆర్ స్రవంతి, జిల్లా అధ్యక్షురాలు మున్నంగి రాహేలు, ప్రతినిధులు శైలజ, శ్రీవల్లి,రాధిక, కొలకలూరి స్వరూపరాణి, ఉదయజానకి, రాధికరత్న, సూర్యకుమారి, కృపావరం తదితరులు పాల్గొన్నారు.