ప్రకాశం

అన్నివర్గాల ప్రజలకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,అక్టోబర్ 17 : నిర్ణీత లక్ష్యాల మేరకు ఎస్‌సి,ఎస్‌టి, బిసి, కాపు, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా త్వరితగతిన రుణాలు మంజూరు చేసి అట్టడుగు వర్గాల ప్రజలను ఆదుకోవాలని కలెక్టర్ వి వినయ్‌చంద్ జిల్లా అధికారులు, బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం స్ధానిక సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో కలెక్టర్ ఎస్‌సి,ఎస్‌టి, బిసి,మైనార్టీ,కాపు కార్పొరేషన్ల రుణాలకు సంబంధించి 2014-15, 2015-16, 2016-17, 2017-18 సంవత్సరాల లక్ష్యాలు, సాధించిన పురోగతిపై జిల్లా అధికారులు, బ్యాంకర్లతో ప్రత్యేక బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద,బడుగు,బలహీనవర్గాల ప్రజల ఆర్థికస్థితిగతులను మెరుగుపర్చాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. అందుకుఅనుగుణంగా నిర్ణీత లక్ష్యాల మేరకు వారికి యూనిట్లు మంజూరు చేసి చేయూతనందించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్లక్ష్యం పనికిరాదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 2017-18 సంవత్సరానికి జిల్లాలో నిర్ణీత లక్ష్యంలో 49శాతం సాధించి రాష్ట్రంలోరెండవ స్దానంలో ఉన్నామన్నారు. ఎస్‌సికార్పోరేషన్ కింద 8850యూనిట్లకు కాను 4404 యూనిట్లు మంజూరుఅయ్యాయని తెలిపారు. ఎస్‌టి కార్పొరేషన్ కింద 755 యూనిట్లకు గాను 257యూనిట్లు, కాపు కార్పొరేషన్‌కింద 3500యూనిట్లకు గాను 2045, బిసి కార్పొరేషన్ కింద 2863యూనిట్లకు గాను 2136 యూనిట్లు, మైనార్టీ కార్పోరేషన్ కింద 806 యూనిట్లకుగాను 561యూనిట్లు మంజూరు చేశారన్నారు. ఇంకామిగిలిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. 2014-15సంవత్సరం నుండి 2016-17 సంవత్సరాలకు సంబంధించి ఇంకా పెండింగ్ ఉన్నా కొన్ని యూనిట్లను రాత్రింబవళ్ళు కష్టపడి ఈనెలాఖరులోగా పూర్తిచేయాలన్నారు. అలాగే 2016-17సంవత్సరానికి సంబంధించి వినియోగ ధ్రువీకరణ పత్రాలను ఆయా బ్యాంకర్లే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. 2017-18సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారులందరికి ఈనెలాఖరులోగా బ్యాంకు ఖాతాలు తెరిపించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. పాడిగేదెల యూనిట్లు మంజూరు కోసంమండల పశువైద్యాధికారులు బ్యాంకర్లకు వివరాలు అందచేసి, ఈనెలాఖరులోగా కొనుగోలు కమిటి ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లి గేదెలు కొనుగోలు చేయాలన్నారు. బ్యాంకర్లు, కార్పొరేషన్ల మధ్య ఏలాంటి సమాచార లోపం ఉండరాదని, కలిసికట్టుగా నిర్ణీత లక్ష్యాలు సాధించాలన్నారు. ఎస్‌సి కార్పొరేషన్‌లో ఉన్న 500మంది ఫెసిలిటెటర్లను బ్యాంకులకు అనుసంధానం చేయాలని, తద్వారా లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు సకాలంలో అందేలా చొరవచూపేందుకు కృషిచేయాలన్నారు. అలాగేరైతురుణ మాఫీ పధకాన్ని బ్యాంకుల్లో సజావుగా అమలుచేయాలన్నారు. ఈసమావేశంలో జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజరు వెంకటేశ్వరరావు, స్ట్ఫెసిఇఒ రవి, సిండికేట్ బ్యాంకు ప్రాంతీయ మేనేజరు హరీష్‌కుమార్, ఎస్‌సి,బిసి కార్పోరేషన్ ఇడిలు జయరాం, నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమశాఖ డిడి లక్ష్మిసుధ, జడ్‌పి డిప్యూటి సిఇఒ సాయికుమారితోపాటు వివిధ శాఖలకుచెందిన అధికారులు పాల్గొన్నారు.