ప్రకాశం

ఉద్యమ స్ఫూర్తితో వనం-మనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,అక్టోబర్ 17 : రాష్ట్రంలో వనం-మనం కార్యక్రమాన్ని ఉద్యమం స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నామని అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. మంగళవారం కేంద్రీయ విద్యాలయంలో గ్రీన్‌ట్రీ పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వనం-మనం కార్యక్రమంలో భాగంగా శిద్దా మొక్కలు నాటారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టడటం జరుగుతుందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమల్లో మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించటం జరిగిందన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో 50శాతం పచ్చదనం ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతివ్యక్తి కనీసం పదిమొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు గ్రీన్‌ట్రి సభ్యులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పౌండేషన్ సభ్యులు రావిపాటి ప్రసాదురావు, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ బి శేఖర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ కాంత్‌రెడ్డితోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.