ప్రకాశం

దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఎండమావేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, అక్టోబర్ 17 : విభజన రాష్ట్రంలో జిల్లా లోని దొనకొండను పారిశ్రామిక కారిడార్‌గా మారుస్తామని అధికారంలో ఉన్న పెద్దలు చెప్పిన మాటలు ఎండమావేనా అని ప్రజలు అంటున్నారు. అమరావతిని రాజధాని చేసి దొనకొండను పారిశ్రామిక కారిడార్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు జిల్లామంత్రి శిద్దా రాఘవరావు ఎన్నో పర్యాయాలు హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికారంలోనికి వచ్చి నాలుగేళ్ళు కావస్తున్నా ఒక్క ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేయని పరిస్థితి ఏర్పడిందంటే ఇక దొనకొండ కారిడార్ ఈ ప్రాంత ప్రజలకు ఎండమావిగా మారనుందన్న అనుమానం బలపడుతోంది. ఈప్రాంతంలో విమానయాన విడిభాగాలతోపాటు యుద్ధవిమానాల మరమ్మతుల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఉక్రెయిన్ దేశం నుంచి నాలుగైదు పర్యాయాలు పారిశ్రామికవేత్తల బృందం వచ్చి చూసివెళ్ళినప్పటికీ వారు ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు బృందం మూడు పర్యాయాలు దొనకొండ విమానాశ్రయాన్ని పరిశీలించి వెళ్ళారు. అయినప్పటికీ ఫలితం లేదు. అనేక కంపెనీలు ఈ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులను అడిగి వివరాలు సేకరించినప్పటికీ ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే పారిశ్రామిక కారిడార్ వస్తే జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన దొనకొండ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందడమే కాక పరిసరప్రాంతాల్లోని మండలాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఈప్రాంత ప్రజలు ఆశించారు. అయితే ప్రభుత్వ ప్రకటనలన్నీ హామీలకే పరిమితం కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా దొనకొండలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చినప్పటికీ అక్కడి నీటి సమస్య వారికి అడ్డంకిగా మారింది. ప్రతిఏడాది వేసవిలో ఈ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం రైలులో మార్కాపురం మండలం గజ్జలకొండ తదితర గ్రామాలకు వెళ్ళి తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న పారిశ్రామికవేత్తలు ప్రజలకే తాగునీరు ఇవ్వలేకుంటే కంపెనీలకు నీరు ఏవిధంగా అందిస్తారన్నదే వారి భయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మంచినీటి వసతి కల్పించి దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు.