ప్రకాశం

అద్దంకిలో వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, డిసెంబరు 11: అద్దంకి పట్టణంలో సోమవారం సాయంత్రం స్ధానిక బంగ్లారోడ్డు వద్ద ప్రసన్న(30) అనే వివాహిత ఉలివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమె రేణింగవరం సమీపంలోని గ్రామానికి చెందినదిగా తెలిసింది. పూర్తిసమాచారం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వివరాల ప్రకారం ప్రమీల గత కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఉంటూ, బంగ్లారోడ్డు వద్ద చిన్న రూము అద్దెకు తీసుకొని ఇద్దరు చిన్నారులను ఇంటికి సమీపంలోని ప్రైవేటు స్కూలులో చదివించుకొంటుంది. భర్త దుర్వ్యసనాలకు బానిసై కుటుంభాన్ని పట్టించుకోకపోవడంతో భర్తకు దూరంగా ఉంటుందని స్ధానికులు తెలిపారు. ఏమైందో ఏమోగాని సోమవారం సాయంత్రం ఆమె ఉంటున్న రూములో ఫ్యానుకు ఉరివేసుకొంది. పిల్లలు స్కూలు నుండి ఇంటికి వచ్చి తలుపు తీసేందుకు ప్రయత్నించినా తీయకపోవడంతో ప్రక్కనే ఉన్న దుకాణాల వారి సహాయాన్ని కోరారు. తలుపు తొలగించి చూడగా ప్రమీల ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఘటన విషయం తెలుసుకున్న సిఐ హైమారావు ఘటనా స్ధలానికి వచ్చి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. మృతురాలి బంధువులెవరూ రాకపోవడంతో, తల్లి మరణంతో అనాధలైన ఇద్దరు పిల్లలను సిఐ హైమారావు స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. ప్రమీల ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు.